https://oktelugu.com/

Puri Jagannadh: పూరి ఇప్పుడు కూడా తన కెరియర్ గురించే చూసుకుంటున్నారు..మరి ఆయన కొడుకు పరిస్థితి ఏంటి..?

ఆకాష్ పూరి మాత్రం ఇంకా ఒక్క సక్సెస్ అయితే కొట్టలేదు. ఇక పూరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన కొడుక్కి ఒక మంచి సక్సెస్ ని అందిస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు కానీ పూరి మాత్రం తన కొడుకుని పట్టించుకోకుండా తన కెరీయర్ గురించే ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : March 12, 2024 / 09:05 AM IST

    Puri Jagannadh

    Follow us on

    Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ అవడంతో ఇప్పుడు రామ్ తో చేస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమా మంచి విజయం సాధించాలని ఒక దృఢ సంకల్పంతో తను ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

    ఈ సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకుంటే మరొకసారి స్టార్ హీరోలు అందరూ తనకు డేట్స్ ఇస్తారని పూరి అనుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి క్రమంలో పూరి ఈ సినిమాని చాలా గొప్పగా తీర్చిదిద్దాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ కొడుకు అయిన ఆకాష్ పూరి పరిస్థితి ఏంటి అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికి ఆకాష్ పూరి ఒక 5 సంవత్సరాల కిందటే హీరోగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. కానీ అప్పటినుంచి ఇప్పటివరకు ఆయనకు ఒక సక్సెస్ కూడా లేదు ఇక ఆయనతో పాటు వచ్చిన యంగ్ హీరోలు అందరూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు.

    ఇక రీసెంట్ గా తేజ సజ్జా కూడా హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. కానీ ఆకాష్ పూరి మాత్రం ఇంకా ఒక్క సక్సెస్ అయితే కొట్టలేదు. ఇక పూరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన కొడుక్కి ఒక మంచి సక్సెస్ ని అందిస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు కానీ పూరి మాత్రం తన కొడుకుని పట్టించుకోకుండా తన కెరీయర్ గురించే ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆకాశ్ పూరి మాత్రం వాళ్ళ నాన్న సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లో ఎదగాలని చూస్తున్నాడు. అందుకే వాళ్ళ నాన్నని పక్కన పెట్టినట్టుగా ఆయన కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు.

    ఆకాష్ పూరి ఎంచుకున్న విధానం బాగానే ఉంది కానీ ఈ రోజుల్లో కొంత సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎదగడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి. పూరి జగన్నాథ్ ఒక్క సినిమా ఆయనతో చేసి ఆయన కొడుక్కి సక్సెస్ ని ఇస్తే మార్కెట్లో తనకి కూడా విపరీతమైన డిమాండ్ పెరుగుతుందంటూ పూరి అభిమానులు అభిప్రాయ పడుతున్నారు…