Homeట్రెండింగ్ న్యూస్Animal Smiles: ఈ సృష్టిలో అందంగా నవ్వే జంతువులివే

Animal Smiles: ఈ సృష్టిలో అందంగా నవ్వే జంతువులివే

Animal Smiles: “ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది. ముత్యాల జల్లు, మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది” తన ప్రియురాలి నవ్వు గురించి వర్ణిస్తూ నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో వెంకటేష్ పాడుతుంటాడు కదా.. నవ్వంటే మనుషులు మాత్రమే కాదు.. అందమైన అమ్మాయిలే అంతకన్నా కాదు.. జంతువులు కూడా నవ్వుతుంటాయి. కాకపోతే వాటిని పసిగట్టే, నేర్పు, ఓర్పు ఉండాలి. ఈ సృష్టిలో అందంగా నవ్వే జాబితా ఒకసారి పరిశీలిస్తే..

క్వోక్కా

ఇది చూడ్డానికి ఎలుకలా ఉంటుంది. పిల్లి అంతా పెద్దగా పెరుగుతుంది. ఇది ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. కంగారు జాతికి చెందింది. దీని నలుపైన కళ్ళు, చూడముచ్చటైన ముక్కు, దూది పింజల్లాంటి చెవులు ప్రత్యేక ఆకర్షణ. ఇది ముసి ముసిగా నవ్వుతుంది. ఆ దృశ్యం చూడ్డానికి ఎంతో బాగుంటుంది.

Quokka
Quokka

డాల్ఫిన్స్

ఇవి సముద్ర జంతువులు. భారీ పరిమాణంలో ఉంటాయి. సముద్రంలో నుంచి ఒక్కసారిగా పైకి లేచి కింద పడతాయి. అప్పుడు ఆ సముద్ర జలాలు విస్పోటనానికి గురవుతాయి.. డాల్ఫిన్ ఒడ్డుకు వచ్చినప్పుడు నవ్వుతూ ఉంటుంది. అప్పుడు దాని ముఖ కవళికలు మారుతాయి. చూడ్డానికి ఆ దృశ్యం చాలా బాగుంటుంది.

Dolphin
Dolphin

ధ్రువపు ఎలుగుబంట్లు

ఇవి చూడ్డానికి చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయి. వాటి వంటిపై తెల్లటి రోమాలు ప్రధాన ఆకర్షణ. ఆ తెల్లటి రోమాల సమూహంలో నల్లటి కళ్ళు, అదే రంగులో ముక్కు, విస్తారమైన నోరు అందంగా కనిపిస్తాయి. ఆహార అన్వేషణలో భాగంగా అవి ఒక్కోసారి నవ్వుతాయి. ఆ సమయంలో అవి చూడ్డానికి టెడ్డి బేర్ లాగా కనిపిస్తాయి.

Polar bear
Polar bear

కోలా

ఇది చూడ్డానికి చిన్న ఎలుగుబంటి లాగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా సముద్ర తీర ప్రాంతాల్లో జీవిస్తుంది. దీని ముక్కు, కళ్ళు, చెవులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇది పూర్తిగా శాకాహారి. చెట్లకు ఉన్న పండ్లను తింటుంది. దీనికి కడుపు నిండినప్పుడు నవ్వుతుంది.

Koala
Koala

రెడ్ పాండా

చూడ్డానికి నక్కలాగా ఉంటుంది. చైనా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ భూమ్మీద అక్కడ మాత్రమే ఇవి ఉన్నాయి. వీటిని రక్షించేందుకు కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటి చెవులు, నోరు, ముక్కు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి అప్పుడప్పుడూ నవ్వుతుంటాయి.. అవి నవ్వినప్పుడు మిక్కీ మౌస్ లాగా దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా రెడ్ పాండాలు ప్రత్యేకమైన రోమాలు కలిగి ఉండడం వల్ల అవి నవ్వితే అందంగా కనిపిస్తాయి.

Panda
Panda

సముద్రపు జంగుపిల్లి

ఈ జంతువు పిల్లి జాతికి చెందింది. సముద్రాల్లో నివసిస్తుంది. సముద్ర జలాల ఉన్నప్పటికీ తన రోమాల కింద ఉన్న ప్రత్యేకమైన కొవ్వు లాంటి పొర భాగంలో రొమ్ములు ఉంటాయి. ఆ రొమ్ముల ద్వారా తన పిల్లలకు పాలిస్తుంది. ఇక దీని శరీరంపై మందంగా రోమాలు ఉంటాయి. అన్నింటికీ మించి ఇది సముద్రపు ఒడ్డుకు వచ్చినప్పుడు నవ్వుతుంది. ముఖ్యంగా తన వేటకు ఏదైనా జంతువు బలైనప్పుడు ఒకలాంటి నవ్వు నవ్వుతుంది.

స్లాత్

ఈ జంతువు బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్. జీవితంలో ఎక్కువకాలం చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడుతూ ఉంటాయి. వీటి చేతులకు ప్రత్యేకమైన గోర్లు ఉంటాయి. వాటి ద్వారా ఆహార అన్వేషణ చేస్తాయి. వీటికి నేత్రాలు, నోరు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. సమూహంగా ఉన్నప్పుడు నవ్వుతుంటాయి.

Sloth
Sloth

గోల్డెన్ రిట్రీవర్

ఈ శునకం చిన్నపాటి సింహం లాగా కనిపిస్తుంది. తీక్షణమైన చూపులతో ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. నోట్లో నుంచి వచ్చిన నాలుక.. బయటికి వచ్చిన దంతాలతో ఒక్కోసారి అది నవ్వుతుంది. ఆ సమయంలో అది మరింత అందంగా కనిపిస్తుంది.

GOLDEN KENNELS
GOLDEN KENNELS

ముళ్ల ఉడుత

ముళ్ళ పంది జాతికి చెందిన ఈ జంతువు.. శరీరం మొత్తం ఈటెల లాంటి ప్రత్యేకమైన నిర్మాణాలు కలిగి ఉంటుంది. చిన్న ముక్కు.. అంతకంటే చిన్నవైన కళ్ళు.. బుల్లి నోరు తో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది బొరియలు చేసుకొని జీవిస్తుంది. బొరియల నుంచి బయటికి వచ్చి ఒక్కోసారి నవ్వుతుంది. ఆ సమయంలో కిచ్ కిచ్ మంటూ శబ్దాలు చేస్తుంది.

ఏనుగు

ఏనుగుల్లో పెద్దవాటి కంటే చిన్న ఏనుగులు నవ్వుతాయి. తన తల్లి దూరంగా వెళ్లి వచ్చిన తర్వాత వాటిని చూసి పిల్ల ఏనుగులు నవ్వుతాయి. చిన్నపాటి శబ్దాలు చేస్తాయి. తొండాని పైకి లేపి, నోరు మొత్తం తెరిచి అమాంతం ఒక రకమైన సంకేతాలు చూపిస్తాయి.

Elephant
Elephant
Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version