Rajinikanth: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మొదటి మూడు సినిమాలతోనే సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.19 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీ హిట్ ను కొట్టి జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.
ఇక ఇదిలా ఉంటే తనకు 19 సంవత్సరాల వయసులోనే సింహాద్రి లాంటి ఒక భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకున్న ఎన్టీఆర్ ని చూసిన రజనీకాంత్ అప్పట్లో సంచలమైన కామెంట్లైతే చేశాడు. ఒక హీరో కెరియర్ లో హీరోయిజాన్ని చూపిస్తూ ఒక నలుగురికి నాయకుడిగా వ్యవహరించే పాత్రను నేను 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత చేశాను. కానీ ఎన్టీఆర్ మాత్రం 19 సంవత్సరాలకే అలాంటి సినిమాలు చేశాడు. ఇప్పటికే ఎన్టీయార్ స్టార్ హీరో అయిపోయాడు. కానీ తర్వాత వచ్చే సినిమాలతో తన స్టార్ డమ్ ని ఎలా కంటిన్యూ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే అప్పటికే ఆయన కెరియర్ పరంగా పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయాడు.
కాబట్టి దానిని మ్యాచ్ చేసే సినిమాలు చేయడం కత్తి మీద సామలాంటిది అంటూ ఆయన ఎన్టీఆర్ గురించి కొన్ని సంచలమైన కామెంట్లైతే చేశాడు. ఇక రజనీకాంత్ చెప్పినట్టుగానే సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ కి వరుసగా ఫ్లాపులు వచ్చాయి. ఆ తర్వాత ఒకటి రెండు హిట్లు వచ్చిన కూడా మళ్ళీ వరుసగా ప్లాపులు వచ్చాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ కి అసలు ఎలాంటి సినిమాలు చేయాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ని 19 సంవత్సరాల వయసులోనే ఒక నాయకుడిగా చూసిన జనాలు ఎలాంటి పాత్ర చేస్తే యాక్సెప్ట్ చేస్తారు అనే విషయాల్లో ఆయనకి క్లారిటీ లేకపోవడంతో ఎన్టీఆర్ ఏ సినిమా పడితే అది చేసుకుంటూ వచ్చాడు.
అందుకే ఆయనకి చాలా ఫ్లాపులు వచ్చాయి. ఇక టెంపర్ సినిమా నుంచి తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తూ సక్సెస్ లు కొడుతూ వస్తున్నాడు… మొత్తానికైతే ఎన్టీయార్ విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పింది నిజమైంది…