Puri Jagannadh- Charmi: లైగర్ మూవీ పూరి, ఛార్మి లను నిండా ముంచేసే సూచనలు కనిపిస్తున్నాయి. సౌత్ తో పాటు ఓవర్సీస్ లో లైగర్ రన్ చివరి దశకు చేరుకుంది. రెండో రోజే దారుణంగా వసూళ్లు పడిపోగా రూ. 50 కోట్లకు పైగా నష్టాలు అంచనా వేస్తున్నారు.లైగర్ మొత్తంగా రూ. 85 నుండి 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు కేవలం 35% రికవరీ మాత్రమే అయ్యింది. ఇక ఏమాత్రం పుంజుకునే మార్గం కనిపించడం లేదు. నైజాం లాంటి ఏరియాలో కూడా లైగర్ షేర్ లక్షల్లోకి వెళ్ళిపోయింది. ఇక మిగతా ఏరియాల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ వెర్షన్ మాత్రమే కొంత మెరుగ్గా ఉంది. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే బ్రేక్ ఈవెన్ కావచ్చు.
కాగా లైగర్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ పూరికి ఫోన్స్ చేస్తున్నారట. నష్టాల గురించి వివరిస్తున్నారట. దిల్ రాజు వైజాగ్ ఏరియా రూ. 4 కోట్లకు కొన్నట్లు సమాచారం . ఆయన ఇప్పటికే పూరీని కలిశారట. లైగర్ మూవీతో అత్యధికంగా నష్టపోయింది వరంగల్ శ్రీను. రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను ఆయన రూ. 60 కోట్ల వరకు చెల్లించి కొన్నారు. వరంగల్ శ్రీనుతో పాటు మిగతా డిస్ట్రిబ్యూటర్స్ నుండి పూరికి ఒత్తిడి పెరిగిందట. నష్టాలు అంచనా వేసి, కొంత మేర తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారట.
Also Read: Samantha: సమంత సోషల్ మీడియాను వదిలేసి అదే పనిచేస్తోందట.?
అయితే డిస్ట్రిబ్యూటర్ నష్టాలు తిరిగి చెల్లించేందుకు పూరి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో ఆయన సానుకూలంగానే ఉన్నారట. నష్టాలు తాను భరించి డిస్ట్రిబ్యూటర్స్ ని కొంతలో కొంత బయటపడేసే ఆలోచన చేస్తున్నారట. మరోవైపు విజయ్ దేవరకొండ సైతం తన రెమ్యూనరేషన్ లో కొంత భాగం తిరిగిచ్చే సూచనలు కలవు. ఆయన సాధారణ రెమ్యూనరేషన్ కి రెట్టింపు రూ. 25 కోట్ల వరకు లైగర్ చిత్రానికి ఛార్జ్ చేశాడట. కాబట్టి విజయ్ కొంత మేర ఆదుకోవచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన లైగర్ నిర్మాత ఛార్మితో పాటు పూరి, విజయ్ దేవరకొండలను ముంచేసింది .
హామీ ఇచ్చిన ప్రకారం డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు పూడ్చని పక్షంలో వాళ్ళు తిరగబడడం ఖాయం. ఇటీవల ఆచార్య విషయంలో దర్శకుడు కొరటాల శివ కోట్లలో నష్టపోయారు. నాలుగేళ్ళ సమయంతో పాటు సంపాదించుకున్న ఆస్తులు అమ్ముకున్నాడు. ఇప్పుడు అదే పరిస్థితి పూరి జగన్నాధ్ కి రావడం శోచనీయం. మరి ఈ ఆర్థిక కష్టాల నుండి పూరి, ఛార్మి ఎలా బయటపడతారో చూడాలి.
Also Read:Sara Bejlek: 16 ఏళ్ల యువ టెన్నిస్ క్రీడాకారిణితో ఆ ముద్దులు.. హగ్గులు ఆ చేష్టలేంటి.? వీడియో వైరల్