Homeక్రీడలుSara Bejlek: 16 ఏళ్ల యువ టెన్నిస్ క్రీడాకారిణితో ఆ ముద్దులు.. హగ్గులు ఆ చేష్టలేంటి.?...

Sara Bejlek: 16 ఏళ్ల యువ టెన్నిస్ క్రీడాకారిణితో ఆ ముద్దులు.. హగ్గులు ఆ చేష్టలేంటి.? వీడియో వైరల్

Sara Bejlek: అమెరికా ఓపెన్ లో 16 ఏళ్ల క్వాలిఫైయర్ సారా బెజ్లెక్‌ గెలుపు సంబరాలు అత్యంత వివాదంగా మారాయి. ఆమె గెలవగానే సారాతో ఆమె కోచ్ ప్రవర్తించిన తీరుపై అందరూ మండిపడుతున్నారు. చిన్న పిల్లతో అలాంటి చర్యలపై అభిమానులు సైతం విరుచుకుపడ్డారు.

Sara Bejlek
Sara Bejlek

పదహారేళ్ల చెక్ ప్లేయర్ సారా బెజ్లెక్ 2022 అమెరికా ఓపెన్ మెయిన్ డ్రాకు చేరుకోవడం ద్వారా తన కెరీర్‌లో పెద్ద పురోగతి సాధించింది. అయితే ఫైనల్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో విజయం తర్వాత ఆమె కోచింగ్ టీమ్‌తో కలిసి విజయోత్సవాలు జరుపుకుంంది. ఈ సందర్భంగా వీరి ప్రవర్తన హద్దులు దాటిందని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె హగ్ చేసుకోగానే ముసలోడు అయిన కోచ్ అలా ప్రవర్తించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

Also Read: Yellow Crazy Ants- Tamil Nadu: తమిళనాడులో గ్రామాలను ఖాళీ చేయిస్తున్న ‘చీమలు’.. అసలెందుకీ దండయాత్ర?

చెక్ రిపబ్లిక్‌కు చెందిన యువ క్రీడాకారిణి హీథర్ వాట్సన్‌ను మూడు రౌండ్లలో ఓడించి సారా తొలి గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాకు చేరుకుంది. ఈ మహత్తర విజయాన్ని జరుపుకోవడానికి ఆమె కోచింగ్ టీమ్‌ వద్దకు వెళ్లింది. సారా బెజ్లెక్ తో టీమ్ సభ్యుడు, కోచ్‌ చాలా అనుచితంగా ప్రవర్తించినట్లు వీడియోలో ఉంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోను చూసి చాలా మండి మండిపడుతున్నారు.

‘సెలబ్రేషన్’ వీడియోను చూసిన టెన్నిస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెన్నిస్ క్రీడాకారిణితో కోచ్ ప్రవర్తించిన చర్యలను హైలెట్ చేస్తూ ఏకిపారేస్తున్నారు. ఇలాంటి వేడుకల విధానం సరైంది కాదని కొందరు హితవు పలుకుతుండగా.. మరికొందరు ఇదంతా లైట్ అంటున్నారు. ఇంతటి “గగుర్పాటుతో కూడిన కౌగిలింతలను” సమర్థించలేమని కొందరు నొక్కి చెబుతున్నారు.

Sara Bejlek
Sara Bejlek

“16 ఏళ్ల అమ్మాయిని ఆమె పిరుదులపై అలా తాకడానికి కోచ్ కు బుద్ది ఉండొద్దా? ఇది సరికాదు. పైగా కోచ్ అయిన ముసలోడుతో లిప్ టు లిప్ కిస్ ఏంటి? వీడియో మరీ అధ్వాన్నంగా ఉంది. ఆమెను “లైంగిక వస్తువు”గా చూపడం సరికాదు ” అని ఒక అభిమాని ట్విట్టర్‌లో మండిపడ్డారు. డబ్ల్యూ.టీఏ మరియు సంబంధిత అధికారులుఈ విషయాన్ని మరింత తీవ్రంగా పరిశీలించాలని కోరారు.

సారా బెజ్లెక్ 2022 అమెరికా ఓపెన్ క్వాలిఫయర్స్‌లో 6-4, 1-6, 6-4 తేడాతో విజయం సాధించింది. మహిళల సింగిల్స్ క్వాలిఫైయింగ్ డ్రాలో 14వ సీడ్ అయిన క్రిస్టినా మ్లాడెనోవిచ్‌ను మట్టికరిపించింది. బెజ్లెక్ 6-4, 6-1 స్కోరుతో ప్రిస్సిల్లా హాన్‌పై విజయం సాధించి క్వాలిఫైయింగ్ చివరి రౌండ్ లోకి ప్రవేశించాడు. ఫైనల్ మ్యాచ్‌లో బెజ్లెక్ బ్రిటీష్ మాజీ నం. 1 హీథర్ వాట్సన్‌తో ఓపెనింగ్ సెట్‌ను కోల్పోయింది, కానీ ఆ తర్వాత 3-6, 6-4, 7-5తో విజయం సాధించింది.

సోమవారం జరిగే మెయిన్‌డ్రా తొలి రౌండ్‌లో ఆమె లియుడ్‌మిలా శాంసోనోవాతో తలపడనుంది. సారా బెజ్లెక్ 2022 అమెరికా ఓపెన్‌లో మెయిన్ డ్రాలో అతి పిన్న వయస్కురాలు. ఆమె ప్రస్తుతం డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 209వ స్థానంలో ఉంది. ఐటీఎఫ్ సర్క్యూట్‌లో ఇప్పటివరకు నాలుగు సింగిల్స్ టైటిళ్లను గెలుచుకుంది. కానీ ఇలా కోచ్ తో ముద్దులు, భారీ హగ్గులు, ఆమె వ్యవహారం చూసి నెటజన్లు మండిపడుతున్నారు.

 

 

https://www.youtube.com/watch?v=5THwJgxJGv0

 

లైగర్‌లో రమ్యకృష్ణ, అనన్యల రెమ్యునరేషన్‌ ఎంతంటే.. || Ramya Krishna || Ananya Panday || Liger

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version