https://oktelugu.com/

Puneeth Rajkumar-Prabhas: ప్రభాస్ పై పునీత్ రాజ్‌ కుమార్ ఎఫెక్ట్ !

Puneeth Rajkumar-Prabhas: ప్రభాస్ ‘రాధేశ్యామ్’కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మార్చి 18న సినిమా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించిందట. అయితే.. దివంగత నటుడు పునీత్ ‘జేమ్స్’ మార్చి 17న రిలీజ్ కానుంది. కాగా.. పునీత్‌కి నివాళిగా మార్చి 17 నుంచి 23 మధ్య కన్నడ నాట వేరే సినిమాలు రిలీజ్ చేయకూడదని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నారు. దీంతో రాధేశ్యామ్ రిలీజ్‌కు అడ్డుకట్టపడ్డట్లయింది. మార్చి 18న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కూడా ఉండటం గమనార్హం. మొత్తానికి కరోనా మూడో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 27, 2022 / 01:12 PM IST
    Follow us on

    Puneeth Rajkumar-Prabhas: ప్రభాస్ ‘రాధేశ్యామ్’కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మార్చి 18న సినిమా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించిందట. అయితే.. దివంగత నటుడు పునీత్ ‘జేమ్స్’ మార్చి 17న రిలీజ్ కానుంది. కాగా.. పునీత్‌కి నివాళిగా మార్చి 17 నుంచి 23 మధ్య కన్నడ నాట వేరే సినిమాలు రిలీజ్ చేయకూడదని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నారు. దీంతో రాధేశ్యామ్ రిలీజ్‌కు అడ్డుకట్టపడ్డట్లయింది. మార్చి 18న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కూడా ఉండటం గమనార్హం.

    Puneeth Rajkumar-Prabhas

    మొత్తానికి కరోనా మూడో వేవ్ దెబ్బకు ఈ భారీ సినిమాలు వాయిదా పడటం ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారింది. దర్శక దిగ్గజం రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ డేట్స్ పై జక్కన్న బయ్యర్లతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోపక్క ప్రభాస్ పాన్ ఇండియా మూవీని మార్చి 18న విడుదల చేయాలని మేకర్స్ కసరత్తులు చేస్తున్నారు. ప్రభాస్ కూడా ఈ రిలీజ్ డేట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

    Also Read: రవితేజతో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ మాజీ భార్య‌ !

    కాగా కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా వంశీ – ప్రమోద్ – ప్రసీద – భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా నిర్మాణానికి కనీసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే హాలీవుడ్ సినిమాలకు పని చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పాల్ ఈ చిత్రానికి వర్క్ చేశాడు.

    అయితే, ఇక ‘రాధేశ్యామ్’ సినిమాని మొదటి నుంచి ఓవర్ గా ప్రమోట్ చెయ్యట్లేదు. సినిమాలో పెద్దగా మ్యాటర్ లేదు అన్నట్టే టీమ్ ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ను చాలా సింపుల్ గా కట్ చేశారు. ప్రభాస్ స్టార్ హీరో అయినా, పాన్ ఇండియా స్టార్ హీరో అయినా కేవలం పరిపూర్ణమైన ప్రేమ కథతోనే ఈ సినిమా సాగుతుందని ఎలివేట్ చేస్తూ వస్తున్నారు.

    Also Read: ఆమె విషయంలో బాలయ్యకు 3 కండీష‌న్లు పెట్టిన ఎన్టీఆర్ !

    Tags