Sri Reddy On Pawan Kalyan: ‘భీమ్లానాయక్’ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. శనివారం కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లు నడిచాయి. తొలిరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 26 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిందని తెలుస్తోంది. వరల్డ్ వైడ్ ఫస్ట్ డే 34 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. నిజానికి ఏపీలో థియేటర్ల సమస్య ఉంది.

ముఖ్యంగా బెనిఫిట్ షోలు లేకపోవడం, టికెట్ రేట్లు తక్కువగా ఉండడంతో కలెక్షన్లలో కొంచెం డ్రాప్ ఉంది. దాంతో పవన్ అభిమానులు ఏపీలో చాలా చోట్ల అనేక రకాలుగా తమ నిరాశను వ్యక్తపరిచారు. అయితే.. కొన్ని చోట్ల మాత్రం వినూత్నంగా జగన్ కి షాక్ ఇచ్చారు. విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ ఫ్లెక్సీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేశారు.
సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టిక్కెట్ ధరల పెంపునకు, ఐదో షోకు అనుమతులు ఇవ్వడంతో పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో కేసీఆర్ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో మంత్రులు కేటీఆర్, తలసాని ఫోటోలు కూడా ఉన్నాయి.
Also Read: పేరు మార్చుకున్న స్టార్ హీరో.. ఎగబడుతున్న కొత్త దర్శకులు !
జగన్ ప్రభుత్వాన్ని అవమానించడానికే ఇలా చేశారు అంటూ వైసీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ మూవీ భీమ్లా నాయక్ పై నటి శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. భీమ్లా నాయక్ సినిమా చాలా చెత్తగా ఉందని.. రాజకీయ లబ్ది కోసమే పవన్ కళ్యాణ్ ఈ చెత్త మూవీని తీసాడని ఆమె ఆగ్రహించారు.
ఇంకా పవన్ ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ‘నీ వ్యక్తిగత లబ్ది కోసం నువ్వు తెలంగాణ ప్రభుత్వాన్ని కలువచ్చు.. చిరంజీవి మాత్రం సీఎం జగన్ ను కలువకూడదా ? అని ఆమె పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా… సీఎం కాలేవన్నారు. మొత్తానికి శ్రీ రెడ్డి తాజా కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.