Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గుండెపోటుతో హఠాన్మరణం చెందిన రాజ్ కుమార్ జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురై సమీపంలోని ఆస్పత్రిలో చేరారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించుకున్న ఆయనను బెంగుళూరు విక్రమ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

గురువారం రాత్రి ప్రముఖ సంగీత దర్శకుడు గురుచరణ్ పుట్టిన రోజు వేడుకకు రాజ్ కుమార్ హాజరయ్యారు. అక్కడే అందరితో సందడిగా గడిపారు. పార్టీలో ప్రముఖ నటుడు విష్ణువర్ధన్ అల్లుడు అనిరుధ్ తో పాటు శ్యాండిల్ వుడ్ ప్రుముఖులతో రాజ్ కుమార్ గడిపినట్లు తెలుస్తోంది. పార్టీలో గురుచరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అందరితో కలిసి సంతోషంగా గడిపినట్లు చెబుతున్నారు.
సుమారు రెండు గంటలకు పైగా బర్త్ డే పార్టీలో ఉన్న రాజ్ కుమార్ శుక్రవారం గుండెపోటుకు గురికావడం అందరిని కలచివేసింది. అయితే రాజ్ కుమార్ కు గురువారం రాత్రే గుండెపోటు వచ్చిందని కొన్ని వార్తలు రావడం సరైంది కాదని చెబుతున్నారు. ఆయన గురువారం ఆరోగ్యంగానే అందరితో కలిసి ఉన్నారని చెప్పారు.
Also Read: Bala Krishna: పునీత్ రాజ్ కుమార్ మృతదేహం వద్ద కన్నీటి పర్యంతమైన బాలయ్య…
గురుచరణ్ పార్టీలో రాజ్ కుమార్ పాల్గొని సందడిగా గడిపిన తీరుపై ఆయన తెలియజేశారు. అందరితో మాట్లాడారని గుర్తుచేశారు. పేరుపేరున అందరిని పలకరిస్తూ ఎంతో ఉల్లాసంగా ఉన్నారన్నారు. ఆయన లేని లోటు తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు. తామిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశామని కంటతడి పెట్టుకున్నారు.
Also Read: Aryan Khan: ఆర్యన్ ఖాన్ బెయిల్ కు ష్యూరిటీ ఇచ్చిన హీరోయిన్… ఎవరో తెలుసా ?