Homeఎంటర్టైన్మెంట్Jr Ntr: పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించిన... జూనియర్ ఎన్టీఆర్

Jr Ntr: పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించిన… జూనియర్ ఎన్టీఆర్

Jr Ntr: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో కర్ణాటక వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పునీత్ లేని లోటుతో భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. తమ అభిమాన పునీత్ రాజ్ కుమార్ ఇక లేరనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  పునీత్ ను చివరిసారి దర్శించుకుని నివాళులు అర్పించడానికి… అభిమానులు భారీగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి తరలి వస్తున్నారు.

junior ntr got emotional on puneeth raj kumar last homeage

కాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బెంగుళూరు లోని కంఠీరవ స్టేడియానికి చేరుకొని… పునీత్ రాజ్ కుమార్ బౌతీక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా పునీత్ పర్ధివ దేహాన్ని చూస్తూ ఎన్టీఆర్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఎన్టీఆర్ కి – పునీత్ రాజ్ కుమార్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఔందని చెప్పాలి. గతంలో ఔనీత్ రాజ్ కుమార్ నటించిన సినిమాలో ఎన్టీఆర్ పాట పాడిన విషయం అందరికీ తెలిసిందే. అలానే పలు ఇంటర్వ్యూ లలో తారక్ తనకు సొంత తమ్ముడు లాంటి వాడని… అతని డాన్స్ అంటే బాగా ఇష్టం అని ఎన్టీఆర్ గురించి పునీత్ రాజ్ కుమార్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఎన్టీఆర్ పునీత్ కు నివాళి అర్పించిన విషయం తెలిసిందే. ఆయనాతో పాటు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా పునీత్ కు నివాళులు అర్పించారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బెంగళూరు బయలుదేరినట్టు తెలుస్తోంది.

Jr NTR Emotional at Puneet Raj kumar final rites at Bangalore Kanteerava Stadium | TV5 News Digital

ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు హాజరయ్యారు. బాలయ్య ఇప్ప‌టికే అక్కడకు చేరుకోగా పునీత్ తో ఉన్న అనుబంధాన్ని… గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ అన్న శివ రాజ్ కుమార్ ను పట్టుకొని బాలయ్య ఏడ్చేశారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version