https://oktelugu.com/

Punith Rajkumar: ఎట్టకేలకు నెరవేరనున్న పునీత్ సంకల్పం.. మ్యూజియంగా తండ్రి నివసించిన పూరిల్లు

Punith Rajkumar: ప్రముఖ కన్నడ స్టార్​ పునీత్​ రాజ్​కుమార్ ఈ లోకాన్ని వదిలి చాలా కాలం అయినా ఇంకా ఆయన జ్ఞాపకాలు కుటుంబసభ్యులతో పాటు అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. పవర్​స్టార్​గా గుర్తింపు పొందిన పునీత్​.. సినీరంగంలో దూసుకుపోతున్న సమయంలో.. అతని ఆకస్మిక మరణం భారతీయ సినిమా పరిశ్రమను కలిచిపేసింది. అయితే, ఇటీవలే ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన తన మరణానికి ముందే తన తండ్రి రాజ్​కుమార్​, పూర్వికులు నివసించిన గానానూర్​లోని ఇంటిని మ్యూజియంగాా మార్చాలని పునీత్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 01:09 PM IST
    Follow us on

    Punith Rajkumar: ప్రముఖ కన్నడ స్టార్​ పునీత్​ రాజ్​కుమార్ ఈ లోకాన్ని వదిలి చాలా కాలం అయినా ఇంకా ఆయన జ్ఞాపకాలు కుటుంబసభ్యులతో పాటు అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. పవర్​స్టార్​గా గుర్తింపు పొందిన పునీత్​.. సినీరంగంలో దూసుకుపోతున్న సమయంలో.. అతని ఆకస్మిక మరణం భారతీయ సినిమా పరిశ్రమను కలిచిపేసింది. అయితే, ఇటీవలే ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన తన మరణానికి ముందే తన తండ్రి రాజ్​కుమార్​, పూర్వికులు నివసించిన గానానూర్​లోని ఇంటిని మ్యూజియంగాా మార్చాలని పునీత్​ అనుకున్నారట.

    Punith Rajkumar

    కానీ, ఈ ఏడాది భారీగా వర్షాలు పడటంతో ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంది. దీంతో.. ఆ ఇంటిని అందంగా పునరుద్ధరించి ఓ మ్యూజియమ్​గా మార్చాలనుకున్నారు పునీత్​. ఈ క్రమంలోనే తను మరణించే కొద్ది రోజుల ముందు ఇంటిని సందర్శించి అందుకు తగ్గ మరమ్మత్తులు చేయించడం మొదలుపెట్టారు. కానీ, మధ్యలోనే హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అందర్నీ షాక్​కు గురి చేసింది.

    Also Read: త్వరలో నటిగా పరిచయం కానున్న మిస్​ యూనివర్స్​.. ఇప్పటికే రెండు సినిమాలకు సైన్​
    అయితే, పునీత్ సంకల్పాన్ని వృధా కానివ్వకుండా రాజ్​కుమార్​ మేనల్లుడు గోపాల్ ముందుకొచ్చారు. శిథిలమైన ఇంటిని శరవేగంగా పునరుద్ధరించే పనిలో పడ్డారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని.. రెండు నెలల్లో ఇల్లు పునరుద్ధరణ పూర్తవుతుందని ఆయన చెప్పారు.  ఈ ఊరితో పునిత్​కు ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయని.. అలాంటిది ఇల్లు శిథిలావస్థ స్థితిలో ఉండటం బాధగా అనిపించి.. దీన్ని పునరుద్ధరణ బాధ్యలు తీసుకున్నట్లు తెలిపారు.

    Also Read: విక్కీకోసం పంజాబీ నేర్చుకున్న కత్రినా.. ఎందుకో తెలుసా?