https://oktelugu.com/

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు దక్కిన అరుదైన గౌరవం…

Puneeth Raj Kumar: క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని విడిచి దాదాపు వారం రోజులు గడుస్తున్న కూడా కర్ణాటక వ్యాప్తంగా ఆయన అభిమానులు విషాదంలోనే ఉన్నారు. ఆయన లేని లోటును ఎవరు పూడ్చలేరంటూ పునీత్ జ్ఞాపలతోనే ఇంకా ఉన్నారు. కేవలం తన నటనతో మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు పునీత్. 1800 మందికి పైగా పిల్లలకు ఉచిత విద్య, 45 ఫ్రీ స్కూల్స్, […]

Written By: , Updated On : November 6, 2021 / 10:41 AM IST
Follow us on

Puneeth Raj Kumar: క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని విడిచి దాదాపు వారం రోజులు గడుస్తున్న కూడా కర్ణాటక వ్యాప్తంగా ఆయన అభిమానులు విషాదంలోనే ఉన్నారు. ఆయన లేని లోటును ఎవరు పూడ్చలేరంటూ పునీత్ జ్ఞాపలతోనే ఇంకా ఉన్నారు. కేవలం తన నటనతో మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు పునీత్. 1800 మందికి పైగా పిల్లలకు ఉచిత విద్య, 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాధాశ్రమాలు, 16 వృద్దాశ్రమాలు, 19 గోశాలలు కట్టించారు పునీత్ రాజ్ కుమార్. అలానే ఆయన తన రెండు కళ్ళను కూడా దానం చేశారు. ఇటీవల ఆ  కళ్లతోనే నలుగురు కంటి చూపును కూడా పొందారు. అయితే ఇప్పుడు తాజాగా  కర్ణాటకకు చెందిన మురుగు మ‌ఠ్ వారు పునీత్ కు అరుదైన గౌర‌వాన్ని అందించారు.
puneeth raj kumar honoured with basava sri award
2021 సంవత్సరానికి గాను పునీత్ కు బ‌స‌వ శ్రీ అవార్డును అంద‌జేయ‌నున్న‌ట్టు ఆ సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. చిన్న వ‌య‌స్సు లోనే  అరుదైన గౌర‌వం అందుకొనున్న హీరోగా  పునీత్ చరిత్రలో కెక్కారు. ఈ అవార్డును వ‌చ్చే ఏడాది పునీత్ జ‌యంతి రోజున అంద‌జేస్తామ‌ని మురుగు మ‌ఠ్ సంస్థ వారు తెలిపారు. అలానే పునీత్ కు “కర్ణాటక ర‌త్న” అవార్డు కూడా ఇవ్వ‌టానికి ప్ర‌య‌త్నిస్తామ‌ని కర్ణాటక ముఖ్యమంత్రి బ‌స్వ‌రాజ్ బొమ్మై గ‌తం లోనే వెల్లడించారు.  ర‌త్న క‌మిటీతో చ‌ర్చించిన త‌ర్వాత ఈ ప్రకటన గురించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సీఎం బొమ్మై తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రెండింగ్ లో చక్కర్లు కొడుతుంది.