https://oktelugu.com/

Puneeth Rajkumar: పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఎవరు చేయబోతున్నారంటే…

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో కర్ణాటక వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పునీత్ లేని లోటుతో భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. సినిమాల పరంగానే కాకుండా పలు సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా పునీత్ ఎంతో పేరు సంపాదించుకున్నారు. దీంతో తమ అభిమాన హీరో ఇక లేరనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  పునీత్ ను చివరిసారి దర్శించుకుని నివాళులు అర్పించడానికి… అభిమానులు భారీగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 30, 2021 / 07:50 PM IST
    Follow us on

    Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో కర్ణాటక వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పునీత్ లేని లోటుతో భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. సినిమాల పరంగానే కాకుండా పలు సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా పునీత్ ఎంతో పేరు సంపాదించుకున్నారు. దీంతో తమ అభిమాన హీరో ఇక లేరనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  పునీత్ ను చివరిసారి దర్శించుకుని నివాళులు అర్పించడానికి… అభిమానులు భారీగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి తరలి వస్తున్నారు.

    పునీత్ రాజ్ నిన్న గుండెపోటుతో మరణించిన విషయం అందరికి తెలిసిందే.  పునీత్ రాజ్ 1999లో డిసెంబర్ 1న చిక్కమగళూరుకు చెందిన అశ్విని రేవంత్‌ని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ధృతి, వందిత పునీత్ రాజ్. అయితే పునీత్ కు అంత్యక్రియలు చేయడానికి కొడుకు లేకపోవడంతో… అతని అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకు వినయ్ రాజ్ కుమార్‌తో అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు అందరూ నిర్ణయం తీసుకున్నారు.

    పునీత్ పెద్ద కుమార్తె పెద్ద కూతురు అమెరికా నుండి బెంగుళూరుకు చేరుకోనున్నారు. ఆ తర్వాత తన తండ్రి పునీత్ రాజ్ కుమార్ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. తనంతండ్రి ఇక లేరన్న చేదు వార్తతో ఆయన మృతదేహాన్ని చూస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. పునీత్  తల్లిదండ్రుల సమాధుల దగ్గర ఆయన అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. పవర్ స్టార్ పునీత్ రాజ్ అంత్యక్రియలను కర్ణాటక ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహిస్తున్నారు అని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు.