న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వివిధ ట్రేడ్ లలో అప్రెంటీస్ జాబ్స్ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 250 ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. https://npcilcareers.co.in/mainsite/default.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
నవంబర్ నెల 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఉద్యోగ ఖాళీలు, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగ ఖాళీలు ఎక్కువ సంఖ్యలో ఉండగా మిగిలిన ఉద్యోగ ఖాళీలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.