Prudhvi Raj: కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ ఎటూ కాకుండా అయిపోయాను తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఐదేళ్ల క్రితం కమెడియన్ గా పృథ్వీ రాజ్ హహ బాగా నడిచింది. వరుస సినిమాలతో బాగా సంపాదించుకున్నారు. ఐతే, వైఎస్సార్సీపీ మోజులో ఆయన పవన్ కళ్యాణ్, మెగాస్టార్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడి అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు. మరోపక్క నమ్ముకున్న జగన్ ఒక పదవి ఇచ్చి, అది లాగేసుకున్నాడు.
మళ్లీ పృథ్వీ రాజ్ ను జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు పృథ్వీ రాజ్ కి ప్రస్తుతం జగన్ పార్టీలో గుర్తింపు లేదు. రాజకీయంగా జీరో అయ్యారిప్పుడు. ఇక సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో పృథ్వీ రాజ్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా తిట్టకుండా ఉండాల్సింది. నేను కొన్నిసార్లు ఎక్కువ రెచ్చిపోయాను అని పృథ్వీ రాజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Also Read: Chiyan Vikram: విక్రమ్ గుండెపోటు పై లేటెస్ట్ హెల్త్ అప్ డేట్.. డీఛార్జ్ అయ్యేది అప్పుడే
అయితే, పృథ్వీ రాజ్ మాటలను ఇంకా బ్యాడ్ గా ప్రమోట్ చేశారట. నిజానికి పృథ్వీ రాజ్, పవన్ కళ్యాణ్ ని తప్ప.. చిరంజీవి గారిని కానీ మెగా హీరోలను ఎప్పుడు విమర్శించలేదట. కేవలం పార్టీ కారణంగా పవన్ కళ్యాణ్ ని తిట్టాను’ అంటూ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ పని అయిపోయింది.
ఇప్పుడు పృథ్వీ రాజ్ కి ఇండస్ట్రీలో అవకాశాలు బాగా తగ్గాయి. మళ్ళీ దశ తిరుగుతుందా అనేది చెప్పడం కష్టమే. పైగా ఇప్పుడు కామెడీ పంథా కూడా బాగా మారింది. దీనికి తోడు తెలుగు సినిమాల్లో కొత్త కమెడియన్స్ ఎక్కువమంది కనిపిస్తున్నారు. పైగా ఆ కొత్తతరం కమెడియన్లు చాలా బాగా రాణిస్తున్నారు. పృథ్వీ రాజ్ తరహా కామెడీకి కాలం చెల్లింది.
ఒక్కటి మాత్రం నిజం. బ్రహ్మానందం తర్వాత ఆ రేంజులో కొన్నాళ్ళు పాటు హంగామా చేసిన కమెడియన్ గా పృథ్వీ రాజ్ కి క్రెడిట్ దక్కింది. కానీ ఆ వైభవం మూడేళ్లు కూడా ఉండలేదు. మరి ఈ నేపథ్యంలో పృథ్వీ రాజ్ ఇక మళ్ళీ ఇంకేం ఫామ్ లోకి వస్తాడు. మరి చూడాలి ఏమి జరుగుతుందో.
Also Read:NTR- Samantha: ఎన్టీఆర్ తో సమంత రొమాన్స్.. మధ్యలో సాయిపల్లవి కూడా ?