Chiyan Vikram: టార్ హీరో చియాన్ విక్రమ్ గుండెపోటుకు గురయ్యారు అనే షాకింగ్ విషయం బయటకు రాగానే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విక్రమ్ కి గుండెపోటు వచ్చిన వెంటనే.. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం విక్రమ్ ను ఐసీయూలో ఉంచి, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.
అయితే, విక్రమ్ కి గుండెపోటు కారణంగా నేడు సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ లాంచ్ ను పోస్ట్ ఫోన్ చేయబోతున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ కి విక్రమ్ హాజరు కావాల్సి ఉండగా ఇలా జరగడం బాధాకరమైన విషయం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క విక్రమ్ అభిమానులు కలవరపడుతున్నారు.
Also Read: NTR- Samantha: ఎన్టీఆర్ తో సమంత రొమాన్స్.. మధ్యలో సాయిపల్లవి కూడా ?
అయితే, తాజాగా కావేరి హాస్పిటల్ నుంచి హెల్త్ అప్ డేట్ ప్రకారం.. విక్రమ్ కి కేవలం వైద్య పరీక్షలు మాత్రమే చేశాము అని, ఆయన ఆరోగ్యం బాగుంది అని, అంతకు మించి భయపడే సమస్య ఏమి లేదని, ఫ్యాన్స్ అందరూ దైర్యంగా ఉండాలని సూచించారు. ఈ రోజు సాయంత్రం విక్రమ్ హాస్పిటల్ నుంచి డీఛార్జ్ కాబోతున్నారు.
విలక్షణ నటుడిగా విక్రమ్ తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా తమిళంలో తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్నాడు. శివపుత్రుడు, అపరిచితుడు, మజా, ఐ వంటి చిత్రాల్లో విక్రమ్ నటన అనితరసాధ్యం. అందుకే, తెలుగు ప్రేక్షకుల్లో కూడా విక్రమ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.
కాకపోతే, గత కొన్ని సినిమాలుగా విక్రమ్ సరైన హిట్ పడలేదు. తమిళంతో పాటు తెలుగులోనూ విక్రమ్ సినిమాలకు మార్కెట్ తగ్గింది. ప్రస్తుతం కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం చేస్తున్న “పొన్నియన్ సెల్వన్”లో విక్రమ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Also Read:Happy Birthday Movie Review: రివ్యూ – హ్యాపీ బర్త్ డే