ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం.. టాలీవుడ్ దర్శక, నిర్మాతలకే చెల్లుతుంది. క్రేజ్ ఉన్న నటీనటులతో సినిమాలు చేసేందుకు వీళ్లేప్పుడు ముందే ఉంటారు. ఇక లాక్డౌన్ సమయంలో సెలబ్రెటీల్లో అందరికీ కంటే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్న నటుడు ఎవరైనా ఉన్నారంటే సోనూసుద్ మాత్రమే. దీంతో అతడి క్రేజ్ ను క్యాష్ చేసుకునేలో దర్శక, నిర్మాతలు పడ్డారు.
Also Read: బిగ్ బాస్ ను నియంత్రిస్తున్న పవన్ ఫ్యాన్స్.. ‘టార్గెట్’ చేస్తే ఎమిలినేటే?
లాక్డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులను సోనూసుద్ ఆదుకున్నాడు. తన సొంత బస్సుల్లో వారిని సొంతూళ్లకు పంపించారు. మరికొందరినీ ఛార్జీలు చెల్లించి రైళ్లల్లో, బస్సుల్లో గమ్య స్థానాలకు చేర్చాడు. వలస కార్మికులనే కాకుండా ఎంతోమందికి సాయం అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు.
ఇటీవల ఓ రైతు తన కూతుళ్లతో నాగలి దున్నతుండటాన్ని సోషల్ మీడియాలో చూసిన సోనూసుద్ ఆ కుటుంబానికి ట్రాక్టర్ ను బహుమతి అందించాడు. లాక్డౌన్లో ప్రభుత్వాలు ప్రజలను గాలికొదిలేస్తే సోనూసుద్ మాత్రం తనవంతు సాయంచేసి అందరి మన్నలను పొందాడు. ప్రస్తుతం సోనూసుద్ ‘అల్లుడు అదుర్స్’ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
ఈ మూవీ షూటింగులో పాల్గొనేందుకు వచ్చిన సోనూసుద్ ను చిత్రయూనిట్ ఘనంగా సత్కరించింది. సోనూసుద్ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నారు. దీంతో ఆయనను కలుసుకునేందుకు దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ఆయనను ఆరుగురు దర్శకులు కలిసి కథలు చెప్పినట్లు సమాచారం.
Also Read: అతడి వల్లే సినిమాల్లో నటిస్తున్నానంటున్న అనుష్క…?
వీటిలో సోనూసుద్ కు కొన్ని విలన్ క్యారెక్టర్లు ఉండగా.. మరికొన్నింటిలో హీరో కథలున్నాయట. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో సోనూసుద్ విలన్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సోనూసుద్ ను హీరోగా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సినిమా తీసేందుకు రెడీ అవుతోంది.