Vijay Deverakonda: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా అడుగుపెట్టి, అతి తక్కువ సమయం లో యూత్ ఐకాన్ గా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవరకొండ. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే సినిమాలో చిన్న పాత్ర ద్వారా పరిచయమైన విజయ్ దేవరకొండ, ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో సపోర్టింగ్ క్యారక్టర్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.
అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తున్న విజయ్ దేవరకొండ , పెళ్లి చూపులు సినిమాతో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ లో హీరో గా నిలదొక్కుకున్నాడు.ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తగిలింది. ఇక్కడి నుండి ఆయన కెరీర్ ఏ రేంజ్ కి వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, మన కళ్లారా చూస్తూనే ఉన్నాం.
విజయ్ దేవరకొండ కెరీర్ ని మలుపు తిప్పిన అర్జున్ రెడ్డి సినిమాలో అద్భుతంగా నటించినందుకు గాను ఆయనకీ ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అయితే ఈ అవార్డుని విజయ్ దేవరకొండ వేలం వేసి అమ్మేసినట్టు తెలుస్తుంది.ఒక్కో సినిమాకి కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే విజయ్ దేవరకొండ కి అవార్డు ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..?, అంత డబ్బులు లేకుండా ఉన్నాడా ఆయన అని అందరూ అనుకున్నారు.
కానీ ఆయన ఆ ఫిలిం ఫేర్ అవార్డుని అమ్మింది తన ఖర్చుల కోసం కాదు, ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యడం కోసం. ఈ ఫిలిం ఫేర్ అవార్డు ని వేలం వేస్తే సుమారుగా పాతిక లక్షల రూపాయిలు వచ్చాయట. ఈ డబ్బులు మొత్తాన్ని విజయ్ దేవరకొండ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చేశాడట విజయ్ దేవరకొండ.ఒక మంచి పని కోసం విజయ్ దేవరకొండ చేసిన ఈ సహాయం గురించి తెలుసుకొని అభిమానులు ఎంతో గర్వపడుతున్నారు.