https://oktelugu.com/

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ మీద స్పందించిన నిర్మాత…

Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ లాంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఇందులో హరిహర వీరమల్లుకు సంబంధించిన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయిందంటూ కొంతమంది అసత్య ప్రకటనలు చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 27, 2024 / 11:42 AM IST

    Producer reacts on the release date of Hari Hara Veera Mallu

    Follow us on

    Hari Hara Veera Mallu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా తనదైన రీతిలో మంచి సక్సెస్ ను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ లో కీలకపాత్ర వహిస్తుండటం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన సెట్స్ మీద మూడు సినిమాలను ఉంచాడు.

    అందులో హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ లాంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఇందులో హరిహర వీరమల్లుకు సంబంధించిన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయిందంటూ కొంతమంది అసత్య ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదంటూ ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన ఏ ఏం రత్నం రీసెంట్ గా స్పందించారు. అయితే ఈ సినిమాకి ఇంకా పవన్ కళ్యాణ్ తన డేట్స్ ను కేటాయించలేదని ఆయన ఎప్పుడైతే డేట్స్ కేటాయిస్తారో అప్పుడే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటూ అదేవిధంగా సినిమా రిలీజ్ డేట్ ని కూడా కొద్దిరోజుల్లోనే అనౌన్స్ చేస్తామంటూ ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు.

    Also Read: NTR Viral Video: ఎన్టీయార్ చిన్నప్పటి క్లాసికల్ డ్యాన్స్ చూస్తే మతిపోతుంది… వీడియో వైరల్…

    ఇక మొత్తానికైతే ఏ ఏం రత్నం ఈ సినిమా మీద మంచి అంచనాలను పెట్టుకున్నాడు. ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో రత్నం గారి కొడుకు అయిన జ్యోతి కృష్ణ ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో జ్యోతి కృష్ణ ఒక భారీ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు…

    Also Read: Kalki Movie: కల్కి సినిమాలో రాంగోపాల్ వర్మ… ఆయన పాత్ర ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..?

    ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు ఒకవేళ తను సినిమాలకు డేట్స్ ఇచ్చిన కూడా ముందుగా ఓజీ సినిమాని కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఆయన మీద ఉంది. ఎందుకంటే ఈ సినిమాను తొందర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాని కంప్లీట్ చేసిన తర్వాత హరిహర వీరమల్లు సినిమా మీదికి పవన్ కళ్యాణ్ డేట్స్ ని కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది…