Jagan: ఆంధ్రప్రదేశ్ లో వరద ప్రభావం కొనసాగుతోంది. ప్రజలు నిరాశ్రయులై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు దీంతో ప్రతిపక్షాలు సైతం గగ్గోలు పెడుతున్నా స్పందించడం లేదు. అధికార యంత్రాంగం కూడా అందుబాటులో కనిపించడం లేదు. దీంతో ప్రజల కష్టాలు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. ఫలితంగా వారి బాధలు వర్ణనాతీతం. అన్నింటిని వదిలి కట్టుబట్టలతో బయటకు వస్తున్న వారికి కనీస వసతులు సైతం కల్పించడం లేదు. దీంతో ప్రజల్లో కూడా ఆందోళన పెరుగుతోంది.

ఇంత పెద్ద విపత్తు చోటుచేసుకున్నా సీఎం మాత్రం వివాహాల విందులకు హాజరు కావడం విమర్శలకు దారితీస్తోంది. ప్రజలు ప్రత్యక్షంగా నరకం చూస్తుంటే సీఎం జగన్ మాత్రం విందులకు పోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ప్రవర్తించడంపై బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాడేపల్లి నుంచి సమీక్షలు చేయడం తప్ప ఆయన నుంచి ఏ రకమైన సహాయం అందకపోవడం గమనార్హం.
మరోవైపు తన సొంత మీడియాలో ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తూ ప్రజలకు మరింత ఆగ్రహం తెప్పిస్తున్నారని తెలుస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించకపోగా తన పత్రికలో ఇసుక అమ్మకాలపై ప్రకటనలు ఇస్తూ ప్రజల్లో ఆందోళన పెరిగేలా చేస్తున్నారు. దీంతో జగన్ పై సహజంగానే ప్రజలకు తీవ్ర స్థాయిలో కోపం పెరిగిపోతోంది. ప్రజల కష్టాలకు బదులు ప్రకటనలు ఇస్తూ తన పత్రికలో తన చేతగాని తనాన్ని దాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రజలంతా బాధల్లో ఉంటే ఆయన ప్రకటనలు ఇవ్వడంపై అందరిలో ఆగ్రహం పెరుగుతోంది.
Also Read: KCR Jagan: కలిసిన కేసీఆర్, జగన్..చంద్రబాబు సింపతిపై కీలక సమాలోచనలు?
దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఏపీలో ప్రభుత్వం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ప్రజలంతా కష్టాల్లో ఉంటే సీఎం విందులకు ఎలా వెళ్తున్నారని అడిగారు. ఇలాంటి సీఎంను తాను ఎప్పుడూ చూడలేదని ఎద్దేవా చేశారు. ప్రజలు వరదల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటుంటే వారి కష్టాలు పట్టడం లేదన్నారు. ప్రభుత్వానికి కనీసం ప్రజల బాధలకు చలించే తత్వం కూడా లేదా అని విమర్శలు చేశారు. భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించుకుంటారని హితవు పలికారు.
Also Read: Hyderabad Software lady: కాబోయే భర్తను కలిసేందుకు వెళ్లి.. చివరకు ఈ ట్విస్ట్