Homeఎంటర్టైన్మెంట్Balakrishna: ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య మందు తాగాడా... క్లారిటీ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్

Balakrishna: ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య మందు తాగాడా… క్లారిటీ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్

Balakrishna: పబ్లిక్ ఈవెంట్స్ లో బాలకృష్ణ ప్రవర్తన పలుమార్లు వివాదాస్పదం అయ్యింది. ఇక అభిమానులను కొట్టిన సందర్భాలు అయితే కోకొల్లలు. ఎంత సమర్ధించుకోవాలన్న సమాజం కొన్ని విషయాలను అసలు హర్షించదు. హీరోయిన్ అంజలిని బాలకృష్ణ వేదిక మీద తోసేయడం చర్చకు దారి తీసింది. ఈ ఘటన నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. జాతీయ మీడియాలో బాలయ్య అనుచిత ప్రవర్తన మీద కథనాలు వెలువడుతున్నాయి. నెటిజెన్స్ బాలకృష్ణను ఏకి పారేస్తున్నారు.

విషయంలోకి వెళితే… విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari) చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ గెస్ట్ గా వచ్చారు. వేడుక ముగింపు సమయంలో బాలయ్యతో(Balayya) పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్ వేదిక మీదకు వెళ్లారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో హీరోయిన్స్ గా నటించిన నేహా శెట్టి, అంజలితో(Anjali) బాలకృష్ణ ఫోటో దిగాల్సి ఉంది. ఫోటోకి ఫోజిచ్చే క్రమంలో అంజలి కొంచెం ముందుకు వెళ్లారు. బాలయ్య ఆమెను వెనక్కి నెట్టారు. అలా కాదు ఇలా నిల్చోవాలని ఆమెకు సూచించారు.

Also Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చేసే ఈ మూడు సినిమాల్లో భారీ సక్సెస్ అయ్యే సినిమా ఏదంటే..?

ఈ వీడియో వైరల్ గా మారింది. ఒక మహిళ పట్ల పబ్లిక్ లో అలా ప్రవర్తించడం సరికాదని విమర్శలు చేస్తున్నారు. అలాగే బాలయ్య వేడుకలో మద్యం సేవించారని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. బాలయ్య కుర్చీ పక్కన వాటర్, మందు కలిపిన బాటిల్ ఉన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి . ఈ రెండు ఘటనలపై నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.

Also Read: Darling Movie: డార్లింగ్ సినిమాలో ప్రభాస్ నే అల్లాడించిన చిచ్చర పిడుగు… ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

బాలకృష్ణ కుర్చీ పక్కన ఎలాంటి బాటిల్స్ లేవు. ఎవరో సీజీలో చేశారు. బాలకృష్ణ మద్యం సేవించారు అనడంలో నిజం లేదు. ఇక అంజలిని ఆయన క్యాజువల్ గా నెట్టారు. వీడియో కట్ చేసి ప్రసారం చేస్తున్నారు. పూర్తి వీడియో మీరు చూస్తే… అనంతరం వారు హైఫై చెప్పుకున్నారు. బాలకృష్ణ ఏ విధంగాను అంజలితో దురుసుగా ప్రవర్తించలేదని… నాగ వంశీ చెప్పుకొచ్చాడు. అక్కడ బాలయ్య ఇంటెన్షన్ ఏదైనా కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. సోషల్ మీడియాలో బాలయ్య పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

Exit mobile version