Producer KS Rama Rao : ఎన్టీఆర్ సినిమా పై రాజకీయ కుట్రలు చేసి డిజాస్టర్ ఫ్లాప్ చేసారు అంటూ సీనియర్ నిర్మాత షాకింగ్ కామెంట్స్!

దమ్ము సినిమాని నిర్మించిన కె ఎస్ రామారావు రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ దమ్ము కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు . ఆయన మాట్లాడుతూ 'దమ్ము చిత్రం ఫ్లాప్ అయ్యింది కదా అని సినిమా బాగాలేదు అంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను.

Written By: Vicky, Updated On : August 16, 2024 8:03 pm

KS Rama Rao Comments

Follow us on

Producer KS Rama Rao : నేటి తరం స్టార్ హీరోలలో మాస్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఆయన, అతి తక్కువ సమయంలోనే తిరుగులేని మాస్ హీరో గా ఎదిగాడు. సరిగ్గా మీసాలు కూడా రాని సమయంలో ఆయన చేసిన ‘ఆది’ , ‘సింహాద్రి’ చిత్రాలు అప్పట్లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకున్నాయి. అంతే కాదు వయస్సుకి మించిన భారమైన మాస్ పాత్రలు చేసి సూపర్ స్టార్ గా ఎదిగాడు. అలా చిన్న వయస్సులోనే బలమైన మాస్ సినిమాలు చేసిన ఎన్టీఆర్ కి, అదే తరహా మాస్ కథలను రాసేందుకు దర్శకులకు, రచయితలకు పెద్ద సవాలు అయ్యింది. అలాంటి సమయంలో ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వం లో ‘దమ్ము’ అనే చిత్రం చేసాడు.

అప్పుడే బోయపాటి శ్రీను బాలయ్య బాబు తో ‘సింహా’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చేసి మంచి ఊపు మీద ఉన్నాడు. ఆ సమయం లో ఎన్టీఆర్ తో ‘దమ్ము’ చిత్రం ఖరారు అవ్వడంతో ఆ చిత్రంపై అంచనాలు ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరిపోయింది. అంతే కాకుండా ట్రైలర్ కూడా అదిరిపోవడం తో ఎన్టీఆర్ నుండి చాలా కాలం బాకీ ఉన్న మాస్ సినిమా ‘దమ్ము’ ద్వారా వచ్చేసినట్టే అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ విడుదల తర్వాత ఆ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమా కొత్తగా విడుదలై థియేటర్స్ లో రన్ అవుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలై సునామీ ని సృష్టించింది. ఆ సునామీ లో దమ్ము చిత్రం కొట్టుకుపోయింది.

అయితే ఈ సినిమాని నిర్మించిన కె ఎస్ రామారావు రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ దమ్ము కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు . ఆయన మాట్లాడుతూ ‘దమ్ము చిత్రం ఫ్లాప్ అయ్యింది కదా అని సినిమా బాగాలేదు అంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను ఎంతో అద్భుతంగా తీసాడు. కానీ ఆ సమయం లో కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. రాజకీయంగా ఈ చిత్రంపై ఎన్నో కుట్రలు జరిగాయి, అవి ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు వాటి గురించి చెప్తాను’ అటు చెప్పుకొచ్చాడు. ఇంతకీ దమ్ము సినిమాకి ఏ రాజకీయ కారణాలు అడ్డొచ్చాయి? అని సోషల్ మీడియా లో ఉండే ఎన్టీఆర్ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇకపోతే ఆయన హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం వచ్చే నెల 27 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్స్, సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర మేనియా నే కనిపిస్తుంది.