https://oktelugu.com/

Samantha Ruth Prabhu : న్యాయం చెయ్యండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. వైరల్ అవుతున్న ఇన్ స్టాగ్రామ్ పోస్ట్!

ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే సమంత ప్రస్తుతం డాక్టర్లు ఇచ్చిన సలహాని పాటిస్తూ కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం 'ఖుషి'. విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి ఫలితాన్ని సొంతం చేసుకుంది

Written By:
  • NARESH
  • , Updated On : August 16, 2024 / 08:09 PM IST

    Samantha Ruth Prabhu

    Follow us on

    Samantha Ruth Prabhu  : సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ ఉండే స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సమంత. తనకి సంబంధించిన హాట్ ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చెయ్యడమే కాకుండా అప్పుడపుడు సమాజానికి ఉపయోగపడే విషయాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆమె మాట్లాడే మాటలు కొన్ని వివాదాలకు కూడా దారి తీస్తుంటాయి. అలాగే సమాజంలో ఏ అన్యాయం జరిగినా బాధపడుతూ స్పందించే గుణం ఉన్న అమ్మాయి ఆమె. రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కతా లోని ఆర్ జీ కేఆర్ అనే ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సంఘటన ఎంత దుమారం రేపిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న సినీ సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందించారు. దీనిపై ఇంస్టాగ్రామ్ లో సమంత కూడా రెస్పాన్స్ ఇస్తూ జూనియర్ డాక్టర్ కి న్యాయం చెయ్యాలి అంటూ గుండె బద్దలైన ఎమోజి ఒకటి పెట్టి స్టోరీ లో షేర్ చేసింది.

    ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే సమంత ప్రస్తుతం డాక్టర్లు ఇచ్చిన సలహాని పాటిస్తూ కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘ఖుషి’. విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి ఫలితాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె మయోసిటిస్ వ్యాధికి శస్త్ర చికిత్స చేయించుకొని ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేసింది. అతి త్వరలోనే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఆమెతో గతం లో ‘ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 చేసిన రాజ్& డీకే ఈ సిరీస్ కోసం మరోసారి చేతులు కలిపారు. రీసెంట్ గానే ఈ సిరీస్ కి సంబంధించిన టీజర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అంతే కాదు సమంత రీసెంట్ గా ‘ట్రలాల మూవింగ్ పిక్చర్స్’ అని ఒక నిర్మాణ సంస్థని కూడా స్థాపించింది. ఈ సంస్థ ద్వారా ఆమె కొత్తగా ఇండస్ట్రీ కి వచ్చే వారిని ప్రోత్సహిస్తూ వారిని పెట్టి సినిమాలు తియ్యనుంది.

    ఇకపోతే రీసెంట్ గానే ఈమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఆమెకి వస్తున్న ఆఫర్స్ మొత్తం పాన్ ఇండియా రేంజ్ లోనే ఉన్నాయి. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండబోతుంది. మరోపక్క ఆమె మాజీ భర్త నాగ చైతన్య రీసెంట్ గానే శోభిత దూళిపాళ్ల అనే యంగ్ హీరోయిన్ తో నిశ్చితార్థం చేసుకొని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా సమంత ఫ్యాన్స్ నువ్వు నీ మాజీ భర్త కంటే పెద్ద స్టార్ వి, మరోసారి నీ సత్తా చూపించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    Samantha