https://oktelugu.com/

Kriti Sanon : ఇంటర్వ్యూ లో ఏడ్చేసిన స్టార్ హీరోయిన్.. ప్రభాస్ తో నటించి తప్పు చేశా అంటూ కామెంట్స్!

రామాయణం ని కించపరిచే విధంగా వక్రీకరిస్తూ ఈ సినిమాలో ఎన్నో సన్నివేశాలు ఉన్నాయని దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. దీనిపై ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి సనన్ మాట్లాడుతూ 'ఆదిపురుష్ చిత్రం ఫ్లాప్ అయ్యినందుకు చాలా బాధవేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 16, 2024 / 07:50 PM IST

    Kriti Sanon comments on Prabhas

    Follow us on

    Kriti Sanon : ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ తో కలిసి నటించాలని ఏ హీరోయిన్ కి మాత్రం ఉండదు చెప్పండి?, ఆయన సినిమాలో చిన్న పాత్రలో కనిపించినా చాలు ప్రపంచంలో ఉన్న ఆడియన్స్ అందరికీ కనిపిస్తాము అని అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారు. కానీ ఒక క్రేజీ యంగ్ హీరోయిన్ మాత్రం ప్రభాస్ తో కలిసి ఎందుకు నటించాను అని ఈరోజు బాధపడుతుందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు, కృతి సనన్. వీళ్ళిద్దరూ కలిసి రాముడు, సీత పాత్రలలో ‘ఆదిపురుష్’ చిత్రంలో నటించారు. భారీ బడ్జెట్ తో తీసిన రామాయణ గాథ కావడంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ కళ్ళు చెదిరాయి. ఆ ఓపెనింగ్స్ కారణంగానే ఈ సినిమాకి కేవలం మొదటి వారం లోనే 400 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది.

    కానీ ఓవరాల్ గా మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అంతే కాదు రామాయణం ని కించపరిచే విధంగా వక్రీకరిస్తూ ఈ సినిమాలో ఎన్నో సన్నివేశాలు ఉన్నాయని దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. దీనిపై ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి సనన్ మాట్లాడుతూ ‘ఆదిపురుష్ చిత్రం ఫ్లాప్ అయ్యినందుకు చాలా బాధవేసింది. మేమంతా ఆ చిత్రం కోసం ఎంతో కష్టపడి పని చేసాము. ఒక మతాన్ని అవమానించే ఉద్దేశ్యంతో ఆ సినిమా తియ్యలేదు. కానీ జనాలకు అలా అర్థమైంది’ అంటూ ఆమె ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంకా ఆమె మాట్లాడుతూ ఈ సినిమా నాకు లాభం కంటే ఎక్కువగా నష్టాలనే తెచ్చిపెట్టింది. ఈ సినిమా షూటింగ్ సమయం లోనే నాకు ప్రభాస్ లవ్ ఎఫైర్ ఉన్నట్టు రూమర్స్ ప్రచారం చేసారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకుంది. కొన్ని మీడియా సంస్థలు అయితే మా ఇద్దరికీ విదేశాల్లో నిశ్చితార్థం కూడా రహస్యంగా జరిగిపోయింది అని ప్రచారం చేసాయి. ఇవి మా ఇంట్లో వాళ్లకి తెలిసి చాలా బాధపడ్డారు, నిజంగానే మేమిద్దరం నిశ్చితార్థం చేసుకున్నామని వాళ్ళు నమ్మేశారు అంటూ చెప్పుకొచ్చింది.

    అసలు ఈ సినిమా చేసి ఉండకపొయ్యుంటే బాగుండేదని, మేము ఈ చిత్రాన్ని ప్రారంభించిన ముహూర్తం బహుశా సరైనది కాదేమో అంటూ కృతి సనన్ చెప్పుకొచ్చింది. ఇకపోతే కృతి సనన్ కి ఉత్తమ నటిగా ‘మిమి’ చిత్రానికి గానూ నేషనల్ అవార్డు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం లో ఆమె ఒక సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రం ద్వారా మన ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆమె నిర్మాతగా మారి ‘డూ పట్టి’ అనే చిత్రం లో నటించింది. ఈ సినిమాలో ఆమె సైకో విలన్ గా నటించింది. బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ దేవగన్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.