Dil Raju: 2022 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు భారీ సినిమాలు సిద్ధమైన సంగతి అందరికీ తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ఆర్ఆర్తో పాటు ప్రభాస్ రాధేశ్యామ్, పవన్ కళ్యాణ్-రానా నటించిన భీమ్లా నాయక్ సినిమాలు కూడా ఈ రేసులో ఉన్నాయి. అయితే, నిన్న జరిగిన నిర్మాతల సమావేశంలో రాజమౌళి అభ్యర్థన మేరకు సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయక్ తప్పుకుంది. ఈ విషయంపై స్పందించిన నిర్మాత దిల్‌రాజు.. అభిమానులు అర్థం చేసుకోవాలని కోరారు.
Also Read: 2022లో సందడి చేయనున్న అగ్రహీరోలు వీరే..
ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు మూడేల్లుగా పనుల్లోనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి వస్తున్న కారణంగానే గంగూబాయి కతియావాడి ఫిబ్రవరికి వాయిదా పడింది. అలాగే, భీమ్లానాయక్ సినిమా కూడా బరిలో ఉన్న సంగతి తెలిసిందే.. ఇలా ఒకేసారి మూడు పెద్ద సినిమాలు విడుదలైతే స్క్రీన్ షేరింగ్‌లో సమస్యలు తలెత్తుతాయి. అందుకే, భీమ్లానాయక్ తప్పుకోవాలని పవన్ కళ్యాణ్‌ను కోరగా.. వారు సానుకూలంగా స్పందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. దీంతో పాటు ఎఫ్3 సినిమా ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉండగా.. ఏప్రిల్29కి వాయిదా వేస్తున్నాం. తమ అభిమాన హీరోలను వీలైనంత త్వరగా థియేటర్లలో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ, ప్రస్తుతం పరిస్థితుల్లో వాయిదా తప్పట్లేదు.. ఈ విషయాన్ని అభిమానులంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.. అని దిల్‌రాజు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే భీమ్లానాయక్ వాయిదా వేసినందుకు గాను.. నిర్మాత చినబాబుతో పాటు త్రివిక్రమ్, పవన్‌లకు ధన్యవాదాలు తెలిపారు డీవివి దానయ్య. దీంతో ఆర్ఆర్ఆర్కు రూట్ క్లియర్ అయినట్లైంది. ఈ సినిమాలో రామ్‌చరణ్, తారక్ హీరోలుగా కనిపించనున్నారు. జనవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది.