https://oktelugu.com/

Sukumar: గురువు అంటే నీలా ఉండాలి… శభాష్ సుకుమార్!

Sukumar: ఓ స్టార్ దర్శకుడు వెనుక పెద్ద టీం ఉంటుంది. డైరెక్షన్, రైటింగ్ డిపార్ట్మెంట్స్ లో పదుల సంఖ్యలో సహాయకులు పని చేస్తారు. ఒక సినిమా అద్భుతంగా రావడంలో వీళ్ళ కృషి ఎంతో ఉంటుంది. అయితే తెర వెనుక పనిచేసే టీమ్ సభ్యులు గుర్తింపుకు నోచుకోరు. చాలా మంది స్టార్ డైరెక్టర్స్ సక్సెస్ క్రెడిట్ అంతా వాళ్లే తీసుకుంటారు. తన టీమ్ మెంబర్స్ ని వెలుగులోకి తీసుకు రావడానికి అసలు ఇష్టపడరు. పరిశ్రమలో పైకి రావాలంటే కావాల్సింది […]

Written By:
  • Shiva
  • , Updated On : December 22, 2021 / 11:27 AM IST
    Follow us on

    Sukumar: ఓ స్టార్ దర్శకుడు వెనుక పెద్ద టీం ఉంటుంది. డైరెక్షన్, రైటింగ్ డిపార్ట్మెంట్స్ లో పదుల సంఖ్యలో సహాయకులు పని చేస్తారు. ఒక సినిమా అద్భుతంగా రావడంలో వీళ్ళ కృషి ఎంతో ఉంటుంది. అయితే తెర వెనుక పనిచేసే టీమ్ సభ్యులు గుర్తింపుకు నోచుకోరు. చాలా మంది స్టార్ డైరెక్టర్స్ సక్సెస్ క్రెడిట్ అంతా వాళ్లే తీసుకుంటారు. తన టీమ్ మెంబర్స్ ని వెలుగులోకి తీసుకు రావడానికి అసలు ఇష్టపడరు. పరిశ్రమలో పైకి రావాలంటే కావాల్సింది గుర్తింపే. ఓ మూవీ క్రెడిట్స్ లో పేరు చూసుకోవాలని ప్రదక్షిణలు చేసే అప్ కమింగ్ దర్శకులు, రచయితలు ఎందరో ఉంటారు.

    Sukumar

    గుర్తింపు వచ్చినప్పుడు మాత్రమే స్వతహాగా ఎదిగే అవకాశం ఉంటుంది. లేదంటే ఏళ్ల తరబడి ఎవరో ఒక స్టార్ డైరెక్టర్ క్రింద పనిచేస్తూ జీవితం వెళ్లబుచ్చాల్సిందే. ఈ విషయంలో మిగతా స్టార్ దర్శకుల కంటే సుకుమార్ చాలా భిన్నమని నిరూపించుకుంటున్నారు. ఆయన తన టీమ్ కి ఇస్తున్న ప్రాధాన్యత, వాళ్ళ గుర్తింపు కోసం పడుతున్న తాపత్రయం చూస్తే ఇది అర్థమవుతుంది.

    నిన్న తిరుపతి వేదికగా పుష్ప సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ వేదికపై సుకుమార్ 15 నిమిషాలకు పైగా మాట్లాడారు. ఆయన స్పీచ్ లో ప్రధాన భాగం టీమ్ గురించే సాగింది. తన వద్ద డైరెక్షన్, రైటింగ్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్న టీమ్ ని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. తన టీమ్ సహకారంతోనే పుష్ప విజయం సాధ్యమైందని వెల్లడించారు. నా టీమ్ గురించి నేను కూడా మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు అన్నారు. టీమ్ సభ్యులను పుష్ప సక్సెస్ మీట్ వేదికగా పేరు పేరున పరిచయం చేశారు.

    Also Read: RRR vs Radheshyam: రాజమౌళికి పవన్ కళ్యాణ్ ఔట్.. తగ్గేదే లే అంటున్న ప్రభాస్.. కాంప్రమైజ్ అయ్యారా?

    తాను ఎదిగితే సరిపోదు, తన దగ్గర పనిచేసే వారు కూడా లైఫ్ లో ఎదగాలనే సుకుమార్ మంచి మనసుకు ప్రశంసలు దక్కుతున్నాయి. సుకుమార్ గతంలో తన అసిస్టెంట్ డైరెక్టర్స్ తో స్వయంగా చిత్రాలు నిర్మించారు. ఆయన నిర్మాతగా మారి వాళ్లకు బ్రేక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా సక్సెస్ లో సుకుమార్ పాత్ర చాలా ఉంది. బుచ్చిబాబుకు ఉప్పెన డైరెక్షన్ ఛాన్స్ దక్కడంలో సుకుమార్ ప్రమేయం కలదు. అలాగే ఉప్పెన సినిమాకు సుకుమార్ తీవ్రంగా ప్రమోషన్స్ నిర్వహించారు . తన శిష్యులను స్టార్స్ డైరెక్టర్స్, రైటర్స్ గా చూడాలనుకుంటున్న సుకుమార్, నిజమైన గురువు అనిపించుకుంటున్నారు.

    Also Read: Pushpa: అందరి దేవుడు ఆ ఏడుకొండలవాడైతే.. నా వెనకున్నది మాత్రం ఆయనే- బన్ని

    Tags