IT companies: ఐటీ సంస్థల్లో ఇక నుంచి హైబ్రిడ్ విధానమేనా?

IT companies: ప్రపంచీకరణ నేపథ్యంలో ఐటీ రంగం ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చెందుతోంది. సాంకేతికను అందిపుచ్చుకోవడంలోనూ, అందరికీ అందించడంలోనూ ఐటీకి సాటి మరేది లేదనే చెప్పొచ్చు. వై2కే ప్రాబ్లం నుంచి ఇప్పటిదాకా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఐటీ సంస్థలు ప్రస్తుతం కరోనా మహమ్మరిని సైతం అంతే ధీటుగా ఎదుర్కొంటూ ముందుకెళుతుండటం విశేషం. కరోనా ఎంట్రీ తర్వాత వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ కుదేలయ్యాయి. ఈ సమయంలో ఐటీ రంగం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటీకీ క్రమంగా పుంజుకుంటోంది. ఊహించని […]

Written By: NARESH, Updated On : December 22, 2021 12:11 pm
Follow us on

IT companies: ప్రపంచీకరణ నేపథ్యంలో ఐటీ రంగం ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చెందుతోంది. సాంకేతికను అందిపుచ్చుకోవడంలోనూ, అందరికీ అందించడంలోనూ ఐటీకి సాటి మరేది లేదనే చెప్పొచ్చు. వై2కే ప్రాబ్లం నుంచి ఇప్పటిదాకా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఐటీ సంస్థలు ప్రస్తుతం కరోనా మహమ్మరిని సైతం అంతే ధీటుగా ఎదుర్కొంటూ ముందుకెళుతుండటం విశేషం.

IT companies

కరోనా ఎంట్రీ తర్వాత వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ కుదేలయ్యాయి. ఈ సమయంలో ఐటీ రంగం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటీకీ క్రమంగా పుంజుకుంటోంది. ఊహించని విపత్తుల్లో టెక్నాలజీని ఎలా వాడుకోవాలో అందరికీ ఐటీ కంపెనీలు నేర్పుతూ దిక్సూచిలా మారుతున్నాయి. ఇండియాలో డిజిటలీకరణకు ప్రజలు అలవాటు పడుతున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు కరోనా సమయంలోనూ జోరు చూపిస్తున్నాయి.

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న ప్రపంచ వ్యాప్తంగా ఒమ్రికాన్ మహమ్మరి అన్నిదేశాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇండియాలోనూ ఒమ్రికాన్ కేసులు కొద్దిరోజులుగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు హైబ్రిడ్ వర్క్ విధానానికి మొగ్గుచూపుతున్నాయి. ఈ విషయంపై టీసీఎస్ సీనియర్ ఉపాధ్యక్షుడు వి.రాజన్న తన అభిప్రాయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

గడిచిన ఏడాదిన్నరగా ఐటీ ఉద్యోగులంతా ఇళ్ల నుంచే పని చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఇందుకు తగ్గట్టుగానే ఐటీ సంస్థలు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయని తెలిపారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులు ఇతర సమావేశాల కోసం న్యూయార్క్, ముంబై, ఢిల్లీ వంటి తదితర ప్రదేశాలకు వెళ్లినట్లు చెప్పారు.

Also Read:   టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో జాబ్స్.. భారీ వేతనంతో

అయితే ఇటీవల అమెరికా, ఐరోపాల్లో ఒమ్రికాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయని చెప్పారు. దీంతో ఐటీ ఉద్యోగులు కార్యాయాలకు వెళ్లడం తగ్గిందని తెలిపారు. ఇకపై ఐటీ ఉద్యోగులు పూర్తి స్థాయిలో కార్యాయాలకు వెళ్లి పని చేసే అవకాశం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. 2025 నాటికి తమ సంస్థల్లోనూ ఏరోజైనా 25మంది ఉద్యోగులే మాత్రమే ఆఫీసు వచ్చి పని చేస్తారని తెలిపారు.

టీసీఎస్ మాదిరిగానే మిగతా సంస్థలు కూడా తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయిస్తున్నాయని తెలిపారు. మన ఐటీ కంపెనీల నైపుణ్యాలను గుర్తించి ఇతర దేశాలు కరోనా సమయంలోనూ  ప్రాజెక్టుల ఎక్కువగా ఇస్తున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఐటీ సంస్థలన్నీ కూడా హైబ్రిడ్ వర్క్ విధానానికే అలవాటు పడే అవకాశం ఉందన్నారు. అలాగే క్లౌడ్, అనలిటిక్స్, కృతిమ మేధ, సైబర్ సెక్యురిటీ, 5జీ సేవలకు మరింత డిమాండ్ పెరగనుందని తెలిపారు.

Also Read: అర్హతతో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?