పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీమూవీ ‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. కానీ.. ప్రచారం మాత్రం ఓ రకంగా పడకేసిందనే చెప్పాలి. నిన్నా మొన్న ప్రారంభమైన ‘వీరమల్లు’ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంటే.. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డల్ అయిపోవడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తానికి ఈ విషయాన్ని గుర్తించిన నిర్మాత దిల్ రాజు.. ప్రమోషన్ స్పీడ్ పెంచేందుకు సిద్ధమయ్యారు.
Also Read: బాలయ్య హీరోయిన్ బీచ్ పక్కన ఇలా
అయితే.. ఇప్పటి వరకూ జరిగిన సాంగ్ రిలీజ్, సోషల్ మీడియా అప్డేట్లు సరిపోవు. ఇంకా ఏదైనా భారీగా జరగాలి. అలా జరగాలంటే.. పవర్ స్టార్ పాల్గొనాల్సిందే. కానీ.. పవన్ సినిమా ప్రమోషన్లో పాల్గొనడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఏం చేయాలి అన్నప్పుడు కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఓ పూట టైం అడిగితే.. పవన్ వచ్చి వెళ్లే అవకాశం ఉంది. కానీ.. అది కూడా అంత ఈజీగా లేదు. దీనికి కారణం పవన్ టైట్ షెడ్యూలే. ఇప్పుడు ఏకధాటి రెండు షూటింగుల్లో పాల్గొంటున్నాడు పవర్ స్టార్. ఉదయం హరిహర వీరమల్లు, మధ్యాహ్నం ఏకే రీమేక్ సెట్లో ఉంటున్నాడు. ఇక, సాయంత్రం పొలిటికల్ అప్డేట్స్ గురించి తెలుసుకుంటూ, అందుకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నాడు.
Also Read: బిగ్ బాస్ సీజన్ 5లో ఈ యాంకర్!?
ఇంతటి బిజీ షెడ్యూల్లో.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు పవన్ వస్తాడా? అన్నది సందేహంగా మారింది. మరోవైపు.. పవన్ ఫ్యాన్స్ నుంచి గోల మొదలైంది. రీఎంట్రీ సినిమాకు సంబంధించిన ప్రచారం లైట్ గా ఉందంటూ కంప్లైంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ను ఖచ్చితంగా ప్రీరిలీజ్ ఈవెంట్ కు తీసుకురావాల్సిన భారం దిల్ రాజుపై పడింది. మరి, ఏం జరుగుతుంది? ఎప్పుడు ఫంక్షన్ చేస్తారు? అసలు పవన్ వస్తాడా? రాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్