భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. మన దేశంలో హిందూ ధర్మంలో దేవుళ్లతో పాటు దేవతలను కూడా పూజిస్తారు. కొన్ని గ్రామాలలో ప్రజలు గ్రామ దేవతలను కొలుస్తారు. అయితే ఒక దేవాలయంలోని దేవత మాత్రం భక్తులు కోరిన కోరికలను నిమిషంలో తీరుస్తూ ఖ్యాతిగాంచారు. భక్తుల కోర్కెలను నిమిషంలో తీర్చే దేవతగా నిమిషాంబదేవికి పేరుంది. కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజాం గ్రామంలో ఈ ఆలయం ఉంది.
Also Read: శయనిస్తున్న దర్శనం కల్పించే శివుడి ఆలయం ఎక్కడుందో తెలుసా..?
పూర్వం ముక్తకుడు అనే రుషి లోక కళ్యాణం కోసం యాగం తలపెట్టగా ఆ యాగం జరిగితే అంతమవుతామని రాక్షసులకు భయం మొదలై యాగానికి విఘ్నాలు కల్పించేందుకు రాక్షసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ముక్తక ఋషి ఎంత ప్రయత్నించినా రాక్షసుల ఆగడాలను అడ్డుకోలేకపోయాడు. ఆ సమయంలో పార్వతీదేవి జ్ఞకుండంలో నుంచి ఉద్భవించి రాక్షసులను సంహరించగా అప్పటినుంచి అక్కడ ఉన్న పార్వతీదేవిని నిమిషా దేవి అని పిలుస్తున్నారు.
Also Read: బియ్యపుపిండితో ముగ్గు వేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
ఒడయార్లనే రాజులు శ్రీరంగపట్నంను రాజధానిగా చేసుకొని పాలన సాగించగా 400 సంవత్సరాల క్రితం కృష్ణరాజ ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహంతో పాటు శ్రీచక్రాన్ని కూడా పూజిస్తారు. అమ్మవారి ఆలయం పక్కన శివుడికి కూడా ఆలయం ఉండగా ఈ ఆలయంలోని శివుడిని మౌక్తికేశ్వరునిగా భక్తులు పూజిస్తున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
భక్తులు ఇక్కడ దేవతకు గాజులు, నిమ్మకాయల దండలను సమర్పిస్తారు. దేవతకు సమర్పించిన నిమ్మకాయలను ఇంట్లో పెట్టుకుంటే సర్వశుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. భక్తుల కోరికలను క్షణాల్లో తీర్చే నిమిషాంబ దేవి ఆలయం హైదరాబాద్ లోని బోడుప్పల్‌లో కూడా ఉంది.