https://oktelugu.com/

Dil Raju: నాని ఈసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారు అంటున్న దిల్ రాజు…

Dil Raju: రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ నటిస్తున్న చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. నాని కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బెంగాల్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఈ ఏడాది డిసెంబర్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ‌ సందర్భంగా వరంగల్‌లో మూవీ ప్రీ రిలీజ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 08:31 PM IST
    Follow us on

    Dil Raju: రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ నటిస్తున్న చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. నాని కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బెంగాల్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఈ ఏడాది డిసెంబర్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ‌ సందర్భంగా వరంగల్‌లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హాజరయ్యారు.

    producer dil raju interesting comments about hero nani

    Also Read: ఆడవాళ్లు అలా మగవాళ్ళు ఇలా… సమంత భలే ప్లస్ అయ్యిందే!

    ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ..‌. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని గుర్తు చేసుకోవాలి. ఆయన రాసిన చివరి పాట ఈ చిత్రంలో ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా అంత అద్భుతంగా రాశారు. సార్ మీరు పైన ఉండి చూస్తున్నారు. మీ పాటను ఈవెంట్‌లో మేమందరం వింటున్నాము అని అన్నారు. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఇప్పటికే సగం విజయం అందుకుందని అన్నారు. అలానే దిల్ రాజు ఈ చిత్రం నిర్మాత అయిన వెంకట్ బోయినపల్లి గురించి చెబుతూ హిట్టు సినిమా తీయాలి ఎలా తీయాలి అడగగానే మీకు నాని దొరికారు ఈ చిత్రంతో హిట్టు సినిమా తీసి మీ చేతిలో పెట్టడానికి అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా ఎదిగారు. ఈ సినిమాతో నాని మ్యాజిక్ క్రియేట్ చేస్తారు అని చెప్పుకొచ్చారు.

    Also Read: అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చిన “లైగర్”… విజయ్ దేవరకొండ