https://oktelugu.com/

Lavanya Tripathi: కొత్త మూవీకి ఒకే చెప్పిన నటి లావణ్య త్రిపాఠి… టైటిల్ ఏంటంటే

Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు సొట్ట బుగ్గల బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత మిస్టర్, ఉన్నది ఒకటే జిందగీ, సోగ్గాడే చిన్నినాయన, ఇంటిలిజెంట్, అర్జున్ సురవరం, భలే భలే మగాడివోయ్ వాటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటో షూట్ తో యూత్ ను ఫిదా చేస్తారు ఈ అమ్మడు. ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 08:23 PM IST
    Follow us on

    Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు సొట్ట బుగ్గల బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత మిస్టర్, ఉన్నది ఒకటే జిందగీ, సోగ్గాడే చిన్నినాయన, ఇంటిలిజెంట్, అర్జున్ సురవరం, భలే భలే మగాడివోయ్ వాటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటో షూట్ తో యూత్ ను ఫిదా చేస్తారు ఈ అమ్మడు. ఈ ఏడాది సందీప్ కిషన్, లావణ్య జంటగా నటించిన “ఎ1 ఎక్స్ ప్రెస్” సినిమా కుడా ఆశించిన విజయం అందుకోలేదని చెప్పాలి.

    Lavanya Tripathi

    Also Read: సమంత “యశోద” సినిమాలో ముఖ్య పాత్ర చేయనున్న… నటి వరలక్ష్మి శరత్ కుమార్

    ఈ మేరకు తాజాగా ఈరోజు లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు. మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై చెర్రీ, హేమలత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ ను… లావణ్య త్రిపాఠి బర్త్ డే సంధర్భంగా  ప్రకటించడం ఓ విశేషం. కాగా దానికి ‘హ్యాపీ బర్త్ డే’ అనే పేరు పెట్టడం మరో విశేషంగా చెప్పుకోవాలి‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  నరేశ్‌ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, సుదర్శన్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అలానే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కాలభైరవ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో మరిన్ని అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి మరి ఈ భామ‌.

    Also Read: అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పుట్టినరోజు నేడు