Actor Suhas: పడి పడి లేచే మనసు సినిమాతో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని పొందారు నటుడు సుహాస్. డియర్ కామ్రేడ్, మజిలీ, ప్రతి రోజు పండగే వంటి చిత్రాల్లో ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్నారు. కలర్ ఫొటో సినిమాతో హీరోగా పరిచయమై తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు సుహాస్. ఆ తర్వాత ఓటీటీ వేదికగా విడుదలైన “ఫ్యామిలీ డ్రామా” చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇవే కాక మరో ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేశారు. అయితే ఈ సినిమా కోసం 5 లక్షలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడట సుహాస్.
Also Read: ఫస్ట్ టైమ్ ఆర్‌ఆర్‌ఆర్ కోసం ఆ పని చేస్తున్న తారక్… ఏంటి అంటే
దానికి కారణం ఏంటంటే ఆ పాత్రలు లో సుహాస్ గుండు కొట్టించుకొని కనిపించాలి. అయితే సుహాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి 40 లక్షలు పారితోషికం తీసుకుంటున్నారు. అయితే గుండు పాత్రలో కనిపించాలి కాబట్టి ఆ సినిమాకు 5 లక్షలు అదనంగా ఇవ్వాలని మేకర్స్ ను కోరాడు అని సమాచారం. ఎందుకంటే నటులు ఎవరైనా సరే అంత త్వరగా గుండు కొట్టించుకోడానికి ఇష్టపడరనే చెప్పాలి. ఎందుకంటే ఆ ఒక్క సినిమా గురించి ఆలోచిస్తే తమ తదుపరి చిత్రాలపై దాని ప్రభావం ఉంటుంది. అందుకే ఆ నష్టాన్ని నిర్మాతలే భరించాలని డిమాండ్ చేశాడట. ఆ పాత్రలో సుహాస్ మాత్రమే చేయాల్సింది కావడంతో నిర్మాతలు వెంటనే అతడు అడిగినంతా ఇవ్వడానికి రెడీ అయిపోయారట. అయితే ఇటీవలే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అయితే ఈ చిత్రానికి ఇంకా పేరు లేదని తెలుస్తుంది.
Also Read: అల్లు అర్జున్ “పుష్ప” చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి విషెస్…