https://oktelugu.com/

VJ Sunny: ప్రైజ్ మనీ ఇచ్చినట్లు ఇచ్చి తిరిగి తీసేసుకున్నారు… అసలు మేటర్ లీక్ చేసిన వీజే సన్నీ!

కష్టపడి ఆడింది నేను .. గెలిచింది వాళ్లు అనేలా ఉంది. ఆట నాది ప్రైజ్ మనీ వాళ్ళది. బిగ్ బాస్ విన్నర్ అయినా నాకు రూ . 50 లక్షలు నాకు ఇవ్వాలి కానీ అందులో దాదాపు రూ . 27 లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్లిపోయింది. అంత డబ్బు టాక్స్ రూపంలో తీసేసుకున్నారు .

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2023 8:21 am
    VJ Sunny

    VJ Sunny

    Follow us on

    VJ Sunny: బిగ్ బాస్ బుల్లితెర పై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్న వారాల ఆధారంగా రెమ్యునిరేషన్ ఇస్తారు. అలాగే టైటిల్ విన్నర్ కి రూ . 50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. దీంతో విన్నర్ కావాలని అందరూ కష్టపడి ఆడతారు. అయితే సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సన్నీ మాట్లాడుతూ ‘ నేను విన్నర్ అయితే కంగ్రాట్యులేట్ నా ఒక్కడికే చెప్పుకోలేదు. గవర్నమెంట్ కి కూడా చెప్పాను. ఎందుకంటే .. జీఎస్టీ ద్వారా నాకంటే ఎక్కువ దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకున్నట్టే మేము.

    కష్టపడి ఆడింది నేను .. గెలిచింది వాళ్లు అనేలా ఉంది. ఆట నాది ప్రైజ్ మనీ వాళ్ళది. బిగ్ బాస్ విన్నర్ అయినా నాకు రూ . 50 లక్షలు నాకు ఇవ్వాలి కానీ అందులో దాదాపు రూ . 27 లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్లిపోయింది. అంత డబ్బు టాక్స్ రూపంలో తీసేసుకున్నారు . కరెక్ట్ గా ఎంత అనేది నాకు గుర్తులేదు కానీ .. సగానికి సగం టాక్స్ ద్వారా తీసుకున్నారు.

    గవర్నమెంట్ టాక్స్ కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన అమౌంట్ నాకు వచ్చింది. ఛానల్ వాళ్ళు టాక్స్ రూపంలో ఆ డబ్బు కట్ చేసుకుని మిగిలిన మొత్తం ఇస్తారు. డొనేషన్స్ రూపంలో చాలా మంది టాక్స్ ఎగ్గొడుతుంటారు కానీ .. మనకి అన్ని తెలివితేటలు ఉంటే ఇక్కడెందుకు ఉంటాం .. అందుకే ఫుల్ ఎమౌంట్ టాక్స్ రూపంలో కట్టవలసి వచ్చింది. అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ.

    దీన్ని బట్టి ఆయనకు కేవలం రూ. 23 లక్షలు చేతికి వచినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకున్న సన్నీ హీరోగా పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న సినిమా’ సౌండ్ పార్టీ ‘. రవి పోలి శెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. సంజయ్ శేరీ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 24న ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించారు.