https://oktelugu.com/

Kajol: బట్టలు విప్పేస్తూ కాజోల్ వీడియో వైరల్… అంతలోనే ట్విస్ట్!

ఇటీవల రష్మిక మందాన బోల్డ్ గా ఉన్న వీడియో వైరల్ అయ్యింది. ఓ జర్నలిస్ట్ నిజం బయటపెట్టే వరకు అది ఒరిజినల్ వీడియో అని నెటిజెన్స్ రష్మిక మందాన మీద మండిపడ్డారు. నిజానికి ఆ వీడియో బ్రిటన్ కి చెందిన జరా పటేల్ అనే యువతిది.

Written By: , Updated On : November 17, 2023 / 08:28 AM IST
Kajol

Kajol

Follow us on

Kajol: ఒకప్పటి హీరోయిన్, అజయ్ దేవ్ గణ్ సతీమణి కాజోల్ దేవ్ గణ్ హాట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె బట్టలు మార్చుకుంటూ అర్థనగ్నంగా ఉన్న వీడియో అది. కాజోల్ ప్రైవేట్ వీడియో ఎలా బయటకు వచ్చిందని పలువురు షాక్ అయ్యారు. క్షణాల్లో ఆ వీడియో వైరల్ కాగా నిజమే అని అందరూ నమ్మారు. అనంతరం అసలు విషయం బయటకు వచ్చింది. రష్మిక మందాన మాదిరి కాజోల్ కూడా డీప్ ఫేక్ టెక్నాలజీకి బలయ్యారు.

ఇటీవల రష్మిక మందాన బోల్డ్ గా ఉన్న వీడియో వైరల్ అయ్యింది. ఓ జర్నలిస్ట్ నిజం బయటపెట్టే వరకు అది ఒరిజినల్ వీడియో అని నెటిజెన్స్ రష్మిక మందాన మీద మండిపడ్డారు. నిజానికి ఆ వీడియో బ్రిటన్ కి చెందిన జరా పటేల్ అనే యువతిది. జరా పటేల్ ఇండియన్ మూలాలున్న బ్రిటన్ అమ్మాయి. తన ఇంస్టాగ్రామ్ లో తరచుగా హాట్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంటుంది. జరా పటేల్ ఒరిజినల్ వీడియో షేర్ చేసిన జర్నలిస్ట్, డీప్ ఫేక్ వీడియోలు చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కామెంట్ చేశాడు.

ఆ పోస్ట్ పై నటుడు అమితాబ్ స్పందించడంతో డీప్ ఫేక్ వీడియోపై మరికొందరు సెలెబ్రిటీలు మాట్లాడారు. రష్మిక మందానకు మద్దతుగా నిలుచున్నారు. తాజాగా కాజోల్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నట్లు డీప్ ఫేక్ వీడియో రూపొందించారు. మరో మహిళకు సంబంధించిన వీడియోను డీప్ ఫేక్ సాంకేతికత వాడి కాజోల్ ఫేస్ తో మార్చారు. ఈ వీడియోపై కాజోల్ కుటుంబ సభ్యులు స్పందించలేదు.

డీప్ ఫేక్ టెక్నాలజీ మహిళల భద్రత, ప్రైవసీకి ముప్పు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. హీరోయిన్స్ వీడియోలు అంటే మార్ఫింగ్ అని జనాలు నమ్ముతారు. సాధారణ మహిళల ఫోటోల ఆధారంగా ఇలాంటి ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే జరిగే నష్టం ఊహించడానికే కష్టం. అందుకే ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకొచ్చి, కఠిన చర్యలు చేపట్టకపోతే ఆకతాయిలు రెచ్చిపోవడం ఖాయం.

Kajol Devgan Chenging Clothes|| Ajoy devgan seeing it's very funny 🤣