Bigg Boss 5 Telugu: వీకెండ్ వస్తుందంటే కంటెస్టెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎలిమినేషన్ వేటు ఎవరిపై పడుతుందో అనే భయం వెంటాడుతుంది. బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకోగా ఫైనల్ కి తీసుకెళ్లే ఈ మూడు వారాలు చాలా కీలకంగా మారనున్నాయి. ఇక ఈ వారం ఏడుగురు ఎలిమినేషన్స్ లో ఉన్నారు. యాంకర్ రవి, ప్రియాంక, సిరి, షణ్ముఖ్, కాజల్, శ్రీరామ్ లతో పాటు సన్నీ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. హౌస్ కెప్టెన్ గా ఉన్న మానస్ మాత్రం నామినేషన్స్ నుండి మినహాయింపు పొందాడు.
ప్రేక్షకుల ఓట్ల ప్రాదిపదికన ఒకరిని హౌస్ నుండి 13వ వారం హౌస్ నుండి బయటకు పంపనున్నారు. ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరో తెలిసిపోయింది. తాజా సమాచారం ప్రకారం హిట్ లిస్ట్ లో సిరి, ప్రియాంక ఉన్నారట. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారనేది విశ్వసనీయ సమాచారం.
అయితే సిరి షణ్ముఖ్ తో ప్రియాంక మానస్ తో బలమైన ఎమోషనల్ బాండింగ్ కలిగి ఉన్నారు. ఒకరు లేకుండా మరొకరు ఉండలేనంతగా ఈ రెండు జంటల మధ్య రిలేషన్ ఏర్పడింది.ఈ మూడు నెలల కాలం సిరి షణ్ముఖ్ తో, ప్రియాంక మానస్ తో గడిపారు. కాబట్టి సిరి, ప్రియాంక లలో ఎవరు ఎలిమినేట్ అయినా పెద్ద ఎమోషనల్ డ్రామా చోటుచేసుకుంటుంది.
సిరి ఎలిమినేట్ అయితే షణ్ముఖ్, ప్రియాంక ఎలిమినేట్ అయితే మానస్ చిన్న పిల్లల మాదిరి ఏడ్చేయడం ఖాయం. ఆదివారం రాత్రి కన్నీళ్లతో టీవీ స్క్రీన్స్ నిండిపోతాయని కొందరు అంటున్నారు.అయితే సిరి కంటే కూడా ప్రియాంకనే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు అధికంగా ఉన్నాయట.
Also Read: RRR Janani Song: ‘ఆర్ఆర్ఆర్’ జననీ కి శతకోటి నమస్సులు
కాగా మరో మూడు వారాల్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. షణ్ముఖ్, సన్నీ, యాంకర్ రవి, శ్రీరామ్, మానస్ టైటిల్ రేసులో ఉన్నట్లు సమాచారం. వివిధ సర్వేలు, పోల్స్ లో అత్యధికంగా ప్రేక్షకులు షణ్ముఖ్, సన్నీకి ఓట్లు వేస్తున్నారు. టైటిల్ విన్నర్ అవుతాడనుకున్న రవి రేసులో వెనుకబడ్డట్లు వినికిడి. ఏది ఏమైనా ఇంకా నెల రోజుల సమయం ఉంది, సమీకరణాలు ఎలాగైనా మారవచ్చు.
Also Read: Genelia: కొడుకు పుట్టినరోజున జెనిలియా ఎమోషనల్ పోస్ట్