Janasena: జనసేన పార్టీ ప్రస్థానం మొదలైంది. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని చూస్తున్న జనసేనకు ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పట్టు దొరికింది. దీంతో ప్రాతినిధ్యం వహించేందుకు సమయం ఆసన్నమైంది. విశాఖపట్నం నగర పాలక సంస్థలో జనసేన ఫ్లోర్ లీడర్ గా బీశెట్టి వసంత లక్ష్మి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా దల్లి గోవింద రెడ్డిలను పదవులు వరించడం గొప్ప విశేషమే. ఇన్నాళ్లు ప్రజా పరిపాలనలో ప్రత్యక్షంగా ప్రాతినిధ్యం లేని జనసేన ప్రస్తుతం ఆ చాన్స్ దొరకడంతో నేతలు సంతృప్తి చెందుతున్నారు. జనసేనకు ముందు అన్ని మంచి రోజులే అని బావిస్తున్నారు.

చట్టసభల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్న పవన్ కల్యాణ్ తమ పార్టీ తరఫున మహిళలను చట్టసభలకు ఎంపిక చేసేందుకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. దీంతోనే వసంత లక్ష్మిని ఫ్లోర్ లీడర్ గా నియమించడంతో మహిళలకు కూడా జనసేనపై గౌరవం కలుగుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో మహిళలకు మరిన్ని పదవులు కేటాయిస్తామని చెబుతున్నారు.
అంతే కాదు అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని చూస్తున్నారు. గంగవరంలో ఉన్న గంగపుత్రులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల గెలుపుతో నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రజాసమస్యల పరిష్కారానికి పార్టీ నడుం కట్టడంతో ప్రజల్లో గుర్తింపు క్రమంగా పెరుగుతోంది.
Also Read: BJP leader Tarun Chugh comments : తెలంగాణలో రాజకీయ కాక.. బీజేపీతో టచ్ లో ఉన్న ఆ పాతిక మంది ఎవరు?
రాష్ర్టంలో రాజకీయ సమీకరణల్లో కూడా భారీ మార్పులు వస్తున్నాయి. అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షాలు కూడా తమ వైఖరిలో మార్పు కనిసిస్తోంది. ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. దీని కోసమే అన్ని ఆయుధాలు సిద్దం చేసుకుంటున్నాయి. అధికారమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: Pawan Kalyan: పవన్ తో ఏం చేయాలో కూడా జగనే నిర్ణయిస్తాడా ?