Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతుంది. ఎనిమిదో వారం నామినేషన్స్ తో హౌస్ హీట్ ఎక్కింది. ఈ రోజు తాజా ప్రోమో లో కంటెస్టెంట్స్ కి ‘ఫ్లోట్ ఆర్ సింక్ ‘అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో బిగ్ బాస్ నిర్వహించే అన్ని టాస్కుల్లో ఎవరైతే గెలుస్తారో వారు కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారు. అలాగే టాస్క్ లో ఓడిపోయిన వారు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకుంటారు అని చెప్పారు బిగ్ బాస్. టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ బిగ్ బాస్ పంపిన వస్తువులు నీటిలో వేస్తే మునిగిపోతాయా లేక నీటిపై తేలుతాయో కరెక్ట్ గా గెస్ చేసి చెప్పాల్సి ఉంటుంది.
ఈ గేమ్ లో శోభా శెట్టి,ప్రియాంక,తేజ,అమర్ దీప్ పాల్గొన్నారు. దీనికి సంచాలక్ గా గౌతమ్ వ్యవహరించాడు. ముందుగా గౌతమ్ ఫైవ్ స్టార్ చాక్లెట్ విత్ కవర్ అని చెప్పగానే నలుగురు సభ్యులు ఫ్లోట్ అని సమాధానం ఇచ్చారు.తర్వాత ఫైవ్ స్టార్ కవర్ లేకుండా అని గౌతమ్ అడిగాడు. దీనికి శోభా ఒక్కటే సింక్ అని సరైన సమాధానం చెప్పింది. మిగిలిన ముగ్గురు ఫ్లోట్ అని చెప్పారు.ఆ తర్వాత ప్లాస్టిక్ గ్లాస్ చూపించాడు గౌతమ్.
దానిని నువ్వు ఎలా పెడతావ్ చెప్పు అంటూ శోభా ప్రశ్నించింది.ఇక అటు మార్చి ఇటు మర్చి ఫ్లోట్ అని చెప్పారు తేజ,శోభా, అమర్ దీప్. తర్వాత పుచ్చకాయ ని నీటిలో వేశాడు గౌతమ్. దానికి తేజ,ప్రియాంక,అమర్ ఫ్లోట్ అవుతుంది అని జవాబిచ్చారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో శోభా పప్పు లో కాలేసింది. తర్వాత స్ప్రైట్ టిన్,ఐస్,శనక్కాయ ఇలా వరుసగా ఒక్కొక్క వస్తువు నీటిలో వేశాడు గౌతమ్.
ఇక ఎండ్ బజర్ మోగింది. సంచలాక్ గౌతమ్ మరొక రౌండ్ పెడతాను అని తేజ తో అన్నాడు. దానికి తేజ ఎండ్ బజర్ మోగింది ఇంకా రౌండ్ కంప్లీట్ అయినట్లే,నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే నీకు ఇవ్వాలనుకున్న వాళ్ళకు ఇచ్చుకో నాకేం ప్రాబ్లెమ్ లేదు అని తేజ గౌతమ్ తో అన్నాడు. బజర్ కట్టకముందు ఆడితే నీకు ఏమైనా నొప్పా నాకు అర్థం కాదు అంటూ అమర్ తేజ పై చిరాకు పడ్డాడు. ఈ గేమ్ లో ప్రియాంక గెలిచినట్లు సమాచారం. దీంతో శోభా కంటెండర్ రేసు నుండి తప్పుకుంది. స్నేహితుల మధ్య చిచ్చుపెట్టిన బిగ్ బాస్ సీరియల్ బ్యాచ్ కి షాక్ ఇచ్చాడు.