Amitabh Bachchan- Rajinikanth: 33 ఏళ్ల తర్వాత తెరపైకి రేర్ కాంబినేషన్… రజినీకాంత్ సర్ప్రైజింగ్ ట్వీట్!

గతంలో అమితాబ్-రజినీకాంత్ కలిసి కొన్ని బాలీవుడ్ చిత్రాలు చేశారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం 'హమ్' 1991లో విడుదలైన ఈ చిత్రంలో అమితాబ్, రజినీకాంత్, గోవిందా, అనుపమ్ ఖేర్ నటించారు.

Written By: NARESH, Updated On : October 25, 2023 4:37 pm

Amitabh Bachchan- Rajinikanth

Follow us on

Amitabh Bachchan- Rajinikanth: జైలర్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు రజినీకాంత్. తన రేంజ్ హిట్ జైలర్ తో అందుకున్నాడు. జైలర్ ఆల్ టైం తమిళ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. జైలర్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. అయితే బాక్సాఫీస్ వద్ద డే బై డే పుంజుకున్న ఈ మూవీ భారీ లాభాలు పంచింది. జైలర్ ఇచ్చిన జోష్ తో రజినీకాంత్ వరుస చిత్రాలు ప్రకటిస్తున్నారు.

తలైవర్ 170 దర్శకుడు టీజీ జ్ఞానవేల్ తో చేస్తున్నారు. నేడు ఈ చిత్రం గురించి ఓ షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. రజిని 170వ చిత్రంలో అమితాబ్ నటిస్తున్నారు. రజినీకాంత్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయం తెలియజేశారు. అమితాబ్ ని తన మెంటర్ గా రజినీకాంత్ అభివర్ణించారు. 33 ఏళ్ల తర్వాత నా మార్గదర్శకుడు అమితాబ్ తో కలిసి తలైవర్ 170 మూవీ చేస్తున్నాను… అని రజినీకాంత్ ట్వీట్ చేశారు.

గతంలో అమితాబ్-రజినీకాంత్ కలిసి కొన్ని బాలీవుడ్ చిత్రాలు చేశారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం ‘హమ్’ 1991లో విడుదలైన ఈ చిత్రంలో అమితాబ్, రజినీకాంత్, గోవిందా, అనుపమ్ ఖేర్ నటించారు. మరలా మూడు దశాబ్దాల తర్వాత రజినీకాంత్-అమితాబ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దీంతో రజినీకాంత్ ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. అప్పట్లో అమితాబ్ సూపర్ స్టార్ కాగా… రజినీకాంత్ ఇప్పటికీ నెంబర్ వన్ కమర్షియల్ హీరోగా ఇమేజ్ కొనసాగిస్తున్నారు.

ఇక రజినీకాంత్ 171వ చిత్రం లోకేష్ కనకరాజ్ తో చేస్తున్నారు. ఇది భిన్నమైన సబ్జెక్టు తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన రజినీకాంత్ పూర్తి సమయం సినిమాలకు కేటాయిస్తున్నారు. విరామం లేకుండా చిత్రాలు చేస్తున్నారు. విక్రమ్ తో కమల్ హాసన్, జైలర్ తో రజినీకాంత్ ఫుల్ ఫార్మ్ లోకి వచ్చారు.