AUS vs NED : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ లో మళ్లీ డేవిడ్ వార్నర్ అదరగొట్టాడు. సెంచరీతో కదం తొక్కాడు. పాకిస్తాన్ పై సెంచరీ కొట్టి ఊపు మీదకు వచ్చిన వార్నర్ ఈ మ్యాచ్ లోనూ అదే జోష్ తో అదరగొట్టాడు.
బుధవారం ఢిల్లీలో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా నెదర్లాండ్ తో మ్యాచ్ లో టాచ్ గెలిచి మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేపట్టింది. మ్యాచ్‌లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ చెలరేగి ఆడాడు. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ త్వరగానే ఔట్ అయిపోయినా కూడా సెంచరీతో డేవిడ్ వార్నర్ చెలరేగాడు.
93 బంతుల్లోనే 104 పరుగులతో సెంచరీ చేశాడు. సెంచరీ పూర్తి అవ్వగానే తన స్టైల్లో గాల్లోకి ఎగిరేసి ఆ తర్వాత మన అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలోని సిగ్నేచర్ స్టెప్ ను చేసి వార్నర్ అలరించాడు. ‘పుష్ప తగ్గేదేలే’ అన్నట్టుగా గడ్డం కింద నుంచి చేయిని తిప్పుతూ వార్నర్ షో చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
హైదరాబాద్ లో పాకిస్తాన్ పై కూడా సెంచరీ చేసి ఇలాగే పుష్ప సిగ్నేచర్ స్టెప్ చేశాడు. ఈరోజు నెదర్లాండ్ పై కూడా సెంచరీ చేశాక అదే ఊపు కంటిన్యూ చేయడం విశేషం.
David Warner hits Pushpa style after completing his . #Warner #Pushpa #AlluArjun #AUSvsNED #ICCWorldCup2023 #DavidWarner pic.twitter.com/8tNI2ETu3W
— SRKxVIJAY (@Srkxvijay) October 25, 2023