Priyanka Chopra Comments: ఒకరి తర్వాత మరొకరితో గ్యాప్ లేకుండా డేటింగ్ చేశాను.. ప్రియాంక చోప్రా బోల్డ్ స్టేట్మెంట్!

కెరీర్ బిగినింగ్ లో ప్రియాంక అసీమ్ మర్చంట్ అనే వ్యక్తితో డేటింగ్ చేశారు. ఆయనతో బ్రేకప్ అనంతరం ప్రొడ్యూసర్ హ్యారీ బవేజా తనయుడు హర్మన్ బవేజాతో డేటింగ్ చేసింది. హర్మన్ కి బ్రేకప్ చెప్పి షాహిద్ కపూర్ తో లింక్ అప్ అయ్యింది.

Written By: Shiva, Updated On : May 12, 2023 10:03 am

Priyanka Chopra Comments

Follow us on

Priyanka Chopra Comments: ఒకరికి భార్యగా ఉన్న ప్రియాంక చోప్రా పెళ్ళికి ముందు డేటింగ్ చేశానని ఓపెన్ గా చెప్పేశారు. అది కూడా పలువురు అబ్బాయిలతో చేసినట్లు ఒప్పుకున్నారు. ప్రియాంక చోప్రా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ… నేను చాలా మంది అబ్బాయిలతో డేటింగ్ చేశాను. నేను పని చేసిన వాళ్లతో ప్రేమలో పడ్డాను. ఒకరి తర్వాత మరొకరితో గ్యాప్ లేకుండా డేటింగ్ చేశాను. ఒక్కరితో కూడా నా ప్రేమ శాశ్వతం కాలేదు. అలా అని వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. అమేజింగ్ పర్సన్స్. కొన్ని బ్రేకప్స్ వేదనకు గురి చేశాయి.

నా ప్రేమ ఎందుకు నిలబడటం లేదని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. చివరి బ్రేకప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాను. అప్పుడు నిక్ జోనాస్ పరిచయమయ్యాడు. అతను నా సోల్ మేట్ అనిపించింది. అందుకే భర్తగా ప్రమోషన్ ఇచ్చాను. నిక్ జోనాస్ కూడా పెళ్ళికి ముందు కొందరు అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. నా పాత జ్ఞాపకాలు వదిలేసి నిక్ తో భవిష్యత్ గురించి ఆలోచించాను.. అని ప్రియాంక చోప్రా వెల్లడించారు.

కెరీర్ బిగినింగ్ లో ప్రియాంక అసీమ్ మర్చంట్ అనే వ్యక్తితో డేటింగ్ చేశారు. ఆయనతో బ్రేకప్ అనంతరం ప్రొడ్యూసర్ హ్యారీ బవేజా తనయుడు హర్మన్ బవేజాతో డేటింగ్ చేసింది. హర్మన్ కి బ్రేకప్ చెప్పి షాహిద్ కపూర్ తో లింక్ అప్ అయ్యింది. కొన్నాళ్ళు షాహిద్ కపూర్ తో ఆమె ఎఫైర్ నడిచింది. షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ లతో కూడా ఆమె డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఫైనల్లీ నిక్ జోనాస్ తో ఆమె బంధం పెళ్లి వరకు వెళ్ళింది.

2018లో నిక్ జోనాస్ ని ప్రియాంక వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి. సరోగసీ పద్ధతిలో ప్రియాంక తల్లయ్యారు. లాస్ ఏంజెల్స్ లో ఇల్లు నిర్మించుకుని అక్కడే ఉంటున్నారు. హిందీ చిత్ర పరిశ్రమకు ప్రియాంక గుడ్ బై చెప్పేశారు. అందుకు కారణాలు కూడా ఇటీవల ఆమె వెల్లడించారు. కొందరు తన మీద రాజకీయాలు చేసి ఆఫర్స్ రాకుండా చేశారని ప్రియాంక ఆవేదన చెందారు. ఇక్కడి పాలిటిక్స్ తట్టుకోలేకే హిందీ పరిశ్రమకు దూరమైనట్లు ఆమె చెప్పుకొచ్చారు.