‘ప్రియాంకా చోప్రా’ తన భర్త నిక్ తో విడిపోయే ఆలోచనలో ఉందనే వార్త ఆ మధ్య బాగా వినిపించింది. కానీ, ఈ బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఆ తరువాత తన భర్తతో కలిసి అందమైన విలాసవంతమైన బంగ్లాను కట్టుకుని.. తన దాంపత్య జీవితాన్ని ఎంతో అందంగా ప్లాన్ చేసుకుందని అమ్మడే చెప్పుకొచ్చింది. పైగా ప్రియాంక బంగ్లా పై ఇప్పటికే అనేక గాసిప్స్ కూడా వినిపించాయి. మళ్ళీ ఏమైందో ఏమో.. ప్రియాంకా చోప్రా – నిక్ జోనాస్ మధ్య చిన్నపాటి గొడవ ఒకటి జరిగిందట. అమెరికన్ సింగర్ గా నిక్ బాగానే పాపులారిటీ సంపాదించాడు. పైగా అతను అక్కడ లవ్ బాయ్ గా కూడా చలామణి అవుతున్నాడు.
అయితే, అతనితో అభిమానులు తరుచూ అతని పెళ్లి ప్రస్తావన తెస్తున్నారట. ఆ సమయంలో ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పిన సమాధానం ప్రియాంకకి నచ్చలేదని.. అప్పటి నుండే ఇద్దరికీ అస్సలు పడడం లేదని, ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతున్నారని.. తొందరపడి పెళ్లి చేసుకున్నామా అంటూ ఒకరి పై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారని ఇలా అనేక రకాలుగా రూమర్స్ మళ్ళీ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రూమర్స్ అన్నిటిలో పెళ్లి తరువాత ప్రియాంకా స్వభావంకి తగ్గట్లు నిక్ ప్రవర్తించట్లేదని… ఈ విషయంలో ఆమె అతని పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉందని అంటున్నారు.
మొత్తానికి ప్రియాంక ప్రవర్తన వల్ల నిక్ కు మానసిక ప్రశాంతత దూరం అవుతుందట. ఆ మాటకొస్తే.. ప్రియాంకాకు మొదటి నుండి చాలా కోపం, ఆమెలో పరిపక్వత లేదని అప్పట్లో బాలీవుడ్ లో గాసిప్స్ వచ్చాయి. ఏది ఏమైనా ప్రియాంకా చోప్రా అంటే ఒకప్పటి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. హిందీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి .. ఆ తరువాత హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడకూడా తనదైన సత్తా చూపించి.. హాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుని తనదైన శైలిలో రెచ్చిపోతూ గ్లామర్ ప్రపంచం పై తన మార్క్ చూపిస్తోంది.