https://oktelugu.com/

Omricon Effect: ఒమ్రికాన్ ఎఫెక్ట్.. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మరణాలు..!

Omricon Effect: చైనాలోని వ్యూహాన్ నగరంలో తొలిసారి వెలుగుచూసిన కరోనా మహమ్మరి ప్రపంచానికి శాపంగా మారింది. గడిచిన రెండు సంవత్సరాలు కరోనాతో ప్రపంచం పోరాడుతూనే ఉంది.  రోజురోజుకు కరోనా కొత్త వేరింట్లు పుట్టికొస్తుండటంతో వీటిని ఎలా కట్టడి చేయడంలో ఎవరికీ పాలుపోవడం లేదు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో అమెరికా, ఇటలీ, బ్రిటన్ వంటి దేశాలు చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఈ దేశాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా నమోదుకాగా ఆర్థికంగానూ చాలా దెబ్బతిన్నాయి. ఈక్రమంలోనే సైంటిస్టుల కృషి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 6, 2022 / 03:46 PM IST
    Follow us on

    Omricon Effect: చైనాలోని వ్యూహాన్ నగరంలో తొలిసారి వెలుగుచూసిన కరోనా మహమ్మరి ప్రపంచానికి శాపంగా మారింది. గడిచిన రెండు సంవత్సరాలు కరోనాతో ప్రపంచం పోరాడుతూనే ఉంది.  రోజురోజుకు కరోనా కొత్త వేరింట్లు పుట్టికొస్తుండటంతో వీటిని ఎలా కట్టడి చేయడంలో ఎవరికీ పాలుపోవడం లేదు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో అమెరికా, ఇటలీ, బ్రిటన్ వంటి దేశాలు చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఈ దేశాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా నమోదుకాగా ఆర్థికంగానూ చాలా దెబ్బతిన్నాయి.

    ఈక్రమంలోనే సైంటిస్టుల కృషి ఫలితం కరోనాకు వ్యాక్సిన్ రావడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. అన్ని దేశాల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపడుతూ ప్రజలను కరోనా నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కరోనా రూపాంతరం చెందుతూ మరింత బలంగా మారుతోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో డెల్లా వేరియంట్ ప్రభావం చూపగా ఇప్పుడు ఒమ్రికాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటం ఆందోళన రేపుతోంది.

    కరోనాతో పోలిస్తే ప్రస్తుతం ఒమ్రికాన్ మరణాలు తక్కువగా నమోదవుతున్నప్పటికీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నారు. ఒమ్రికాన్ కేసుల సంపన్న దేశాల్లో ఎక్కువగా నమోదు అవుతుండగా ఆ దేశాల నుంచి క్రమంగా మిగతా దేశాలకు పాకుతున్నాయి. దీంతో ఇటీవల కాలంలో భారత్ లోనూ ఒమ్రికాన్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి కరోనా ఆంక్షలను విధిస్తున్నాయి.

    ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే బుధవారం ఒక్కరోజే 25లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యారు. కరోనాతో రోజుకు లక్షల సంఖ్యలో బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా బెడ్స్ కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒమ్రికాన్ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. అమెరికాలో కొత్తగా వస్తున్న కేసుల్లో 95శాతం ఒమ్రికాన్ కేసులు ఉంటున్నాయి. ఆ తర్వాత ఫ్రాన్స్ లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.

    అమెరికాలో నిన్న ఒక్కరోజే 7లక్షల4వేల 661మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,802మంది మరణించగా లక్షమంది బాధితులు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్త కేసుల్లో 95శాతం ఒమ్రికాన్ కేసులు ఉంటున్నాయి. కేసుల సంఖ్య చూస్తుంటే అమెరికాలో ఆందోళనక పరిస్థితులు నెలకొన్నట్లే కన్పిస్తున్నాయి. గత వారంతో పోల్చితే కేసుల సంఖ్య 63శాతం పెరగడం గమనార్హం.

    ఫ్రాన్స్‌లోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. నిన్న ఒక్కరోజే 3లక్షల32వేల 252 కొత్త కేసులు నమోదుకాగా 243మంది మృత్యువాతపడ్డారు. ఒమిక్రాన్ ఫ్రాన్స్ లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ దేశంలో ఇంత పెద్దమొత్తంలో కేసులు పెరగడానికి ఒమ్రికానే కారణమని తెలుస్తోంది. ఇటలీలో బుధవారం ఒక లక్షా 89వేల109 కొత్త కేసులు నమోదుకాగా 183మంది ప్రాణాలు కోల్పోయారు.

    బ్రిటన్లో నిన్న ఒక్కరోజే ఒక లక్షా 94వేల 747 మంది వైరస్ బారినపడగా 343మంది మృత్యువాతపడ్డారు. స్పెయిన్లో బుధవారం ఒక లక్షా 37వేల180 మందికి వైరస్‌ సోకగా 148మంది మరణించారు. రష్యాలో 15వేల 772 కొత్త కేసులు రాగా 828 మంది ప్రాణాలను కోల్పోయారు. అమెరికా తర్వాత రష్యాలోనే అధిక మరణాలు నమోదవుతున్నాయి. ఇజ్రాయెల్‌లో రికార్డు స్థాయిలో నిన్న 11,978 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో హంగాంగ్ పలుదేశాల విమాన రాకపోకలపై ఆంక్షలు విధించింది.