Bollywood : సోషల్ మీడియా ప్రొమోషన్స్ ద్వారా అత్యధిక రెమ్యూనరేషన్స్ ని అందుకుంటున్న టాప్ 5 స్టార్ హీరోయిన్స్ వీళ్ళే!

అలా ప్రొమోషన్స్ చేస్తున్నందుకు కానీ సదరు బ్రాండెడ్ కంపెనీ కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని కుమ్మరిస్తున్నారు. అలా ప్రొమోషన్స్ ద్వారా కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ ఎవరో ఒకసారి ఈ స్టోరీ లో చూద్దాము.

Written By: NARESH, Updated On : June 5, 2023 7:58 pm
Follow us on

Bollywood : ఈమధ్య స్టార్ హీరోలు.. హీరోయిన్లు తమకి ఉన్న బ్రాండ్ ఇమేజిని వృథా చేసుకోకుండా కమర్షియల్ గా తెగ వాడేస్తున్నారు. ఇది వరకు వీళ్ళు కేవలం టీవీ యాడ్స్ కి మాత్రమే పరిమితం అయ్యేవారు. ఇప్పుడు టీవీ యాడ్స్ కంటే అత్యంత శక్తివంతంగా మారిపోయింది సోషల్ మీడియా ప్రొమోషన్స్. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ సైతం తమకి ఉన్న లక్షలాది ఫాలోయర్స్ కి రీచ్ అయ్యేలా కొన్ని ప్రొమోషన్స్ చేస్తున్నారు. అలా ప్రొమోషన్స్ చేస్తున్నందుకు కానీ సదరు బ్రాండెడ్ కంపెనీ కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని కుమ్మరిస్తున్నారు. అలా ప్రొమోషన్స్ ద్వారా కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ ఎవరో ఒకసారి ఈ స్టోరీ లో చూద్దాము.

Priyanka Chopra

1) ప్రియాంక చోప్రా:

బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్లిపోయిన ఈ బ్యూటీ కి ప్రస్తుతం యూత్ లో మామూలు క్రేజ్ లేదు. రీసెంట్ గానే ఈమె సిటాడెల్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ తో అమెజాన్ ప్రైమ్ ద్వారా మన ముందుకు వచ్చింది. ఇది కాసేపు పక్కన పెడితే ఈమెకి బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ అందరి కంటే అత్యధిక ఫాలోయర్స్ ఇంస్టాగ్రామ్ లో ఉన్నారు. సుమారుగా 87 మిలియన్ కి పైగా ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ ఉన్న ప్రియాంక చోప్రా , ఒక్క యాడ్ ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ తో ప్రమోట్ చేసేందుకు గాను 2 కోట్ల రూపాయిలు తీసుకుంటుందట.

Deepika

2) దీపికా పడుకొనే :

బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సరిసమానమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దీపికా పడుకొనే కి ఇంస్టాగ్రామ్ లో సుమారుగా 74 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారట. ఈమె ఒక్కో యాడ్ ని ప్రచారం చేసేందుకు సగటున కోటి నుండి రెండు కోట్ల రూపాయిల వరకు అందుకుంటుందట.

3) కత్రినా కైఫ్ :

ఈ హాట్ బ్యూటీ కి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందిరికీ తెలిసిందే, పెళ్ళైన తర్వాత కూడా ఈమెకి క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. అలాగే ఇంస్టాగ్రామ్ తర్వాత తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఈమెకి దాదాపుగా 72 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. ఒక్కో యాడ్ ప్రమోట్ చెయ్యడం కోసం ఈమె కోటి రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.

4) అలియా భట్ :

ఈమెకి కూడా యూత్ లో మామూలు రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు,ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఈమెకి 77 మిలియన్ కి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. రీచ్ కూడా ఈమె పోస్టులకు వేరే లెవెల్ లో ఉంటుంది.ఈమె ఒక్కో యాడ్ ని పోస్ట్ చేసేందుకు గానూ 1.5 కోట్ల నుండి 2 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ని అందుకుంటుందట.

5 ) శ్రద్దా కపూర్ :

ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో ఈమెకి ఉన్నంత రీచ్ వేరే ఏ స్టార్ హీరోయిన్ కి కూడా లేదు అని చెప్పొచ్చు. ఈమె ఏ పోస్ట్ అప్లోడ్ చేసిన నిమిషాల వ్యవధి లోనే మిలియన్ల సంఖ్యలో లైక్స్ మరియు కామెంట్స్ వస్తుంటాయి. ఈమెకి దాదాపుగా 80 మిలియన్ కి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఒక్కో యాడ్ ని పోస్ట్ చేసేందుకు గాను ఈమె కోటి 50 లక్షల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.