Priyamani : సీనియర్ హీరోయిన్స్ లో అందంతో పాటు చక్కటి అభినయం కనబరిచే అతి తక్కువమందిలో ఒకరు ప్రియమణి. ఈమె 2003 వ సంవత్సరం లో విడుదలైన ‘ఎవరే అతగాడు’ అనే తెలుగు చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అవ్వడంతో ఈమెకు తెలుగు లో అవకాశాలు రాలేదు, కానీ తమిళం, మలయాళం ఇండస్ట్రీస్ లో మాత్రం మంచి అవకాశాలు వచ్చాయి. అలా తమిళం లో కాస్త ఫేమ్ సంపాదించుకున్న తర్వాత ఈమె మళ్ళీ టాలీవుడ్ లోకి జగపతి బాబు హీరో గా నటించిన ‘పెళ్ళైన కొత్తలో’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన మరుసటి సంవత్సరం 2007 లో కార్తీ, ప్రియమణి కాంబినేషన్ లో వచ్చిన ‘పారుతీవీరన్’ అనే తమిళ చిత్రం ప్రియమణి కెరీర్ ని మలుపు తిప్పింది.
ఈ చిత్రం లో ఆమె కనబర్చిన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు ని కూడా అందుకుంది. ఈ సినిమా తర్వాత ప్రియమణి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా చేతినిండా అవకాశాలతో సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ భాషలకు కలిపి ఏడాదికి 5 నుండి 10 సినిమాలు చేసేది. చిరంజీవి తో తప్ప బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో ఆమె సినిమాలు చేసింది. అదే విధంగా ఈ తరం స్టార్ హీరోలలో ఆమె ఎన్టీఆర్ తో ఒక్కటే సినిమా చేసింది. ఇప్పుడు ఆమె మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా చేయనప్పటికీ, నటన కి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వెళ్తుంది. ఈ ఏడాది ఆమె నుండి 5 సినిమాలు విడుదలయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ప్రియమణి ఇండియా లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఆర్టిస్టులలో ఒకరు, అందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ ఈమె తన జీవితాన్ని ఎంతో సాధారణంగా ఉండేలా చూసుకుంటుందట. తానూ పెద్ద హీరోయిన్ కాబట్టి తనకంటూ కొన్ని కోరికలు ఉండడం, రిచ్ గా బ్రతకడం ఆమెకి ఇష్టం ఉండదట. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈమె నెలవారీ ఖర్చులు కేవలం 10 వేల రూపాయిలు మాత్రమేనట. హీరోయిన్స్ కేవలం మేకప్ కోసమే లక్షల రూపాయిలు ఖర్చు చేస్తారని అందరూ అంటూ ఉంటారు. అలాంటి కాలం లో ఉన్న ఈమె, మేకప్ ఖర్చులతో కలిపి, తన ఇతర సొంత ఖర్చులన్నిటికీ కలిపి కేవలం పది వేల రూపాయిలు మాత్రమే ఖర్చు చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకొని ఆమె అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనకే ఇతర రాష్ట్రంలో ఉద్యోగం చెయ్యడానికి వెళ్ళినప్పుడు అవలీలగా 15 నుండి 20 వేల రూపాయిలు ఖర్చు అవుతుంది. అలాంటిది ఇంత పెద్ద స్టార్ స్టేటస్ లో ఉంటూ ఇంత తక్కువ ఖర్చులు చేస్తుందంటే నిజంగే గ్రేట్ కదా.