Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం వచ్చే నెల 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మూవీ టీం మొత్తం బయలుదేరింది. రామ్ చరణ్ కి డల్లాస్ విమానాశ్రయంలో భారీ ఎత్తున స్వాగతం పలికారు మెగా అభిమానులు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ అమెరికా గడ్డ మీద ఏమి మాట్లాడబోతున్నాడో అని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ అభిమానులు ఎవ్వరికీ సాధ్యం కానీ అరుదైన రికార్డు ని తమ అభిమాన హీరో కోసం క్రియేట్ చేసారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయవాడ లోని బృందావన కాలనీ లో ఉన్నటువంటి వజ్రా గ్రౌండ్స్ లో రామ్ చరణ్ కి సంబంధించిన 250 అడుగులు ఎత్తు ఉన్నటువంటి కటౌట్ ని గ్రాండ్ గా లాంచ్ చెయ్యబోతున్నారు. ఇంతకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ 230 అడుగుల ఎత్తు తో సలార్ చిత్రం కోసం కటౌట్ లాంచ్ చేశారు. అప్పట్లో ఇది పెద్ద సెన్సేషన్ అయ్యింది. దేశవ్యాప్తంగా దీని గురించి చర్చించుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆ రికార్డుని మరో 20 అడుగుల ఎత్తు ఎక్కువ పెట్టి బీట్ చేసారు. ఈ కటౌట్ ఎలా ఉండబోతుందో చూడాలని సోషల్ మీడియా లో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ కటౌట్ లాంచ్ కి ముఖ్య అతిథిగా పలువురు సినీ ప్రముఖులు విచ్చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా ఈ నెల 27 వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పెరేడ్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. అదే విధంగా జనవరి 4 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాజముండ్రి లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో రెండు రోజుల్లో రాబోతుంది. ‘రంగస్థలం’ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ తన అబ్బాయ్ రామ్ చరణ్ సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రాబోతుండడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఈవెంట్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి మంచి బూస్ట్ ఇస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.