Actress Priyamani: భామాకలాపం మూవీలో నటించిన ప్రియమణి తాను చేసిన అనుపమ పాత్ర గురించి చెప్పుకొచ్చింది. భామా కలాపంలో తనది చెఫ్ రోల్ అయినప్పటికీ నిజ జీవితంలో మాత్రం కాదంది. తన భర్త ముస్తఫారాజ్ వంట చేస్తే తాను తింటానని పేర్కొంది. తన వైవాహిక జీవితం పై వస్తున్న నెగెటివ్ పుకార్లను పట్టించుకోనంది. వాటి పై రియాక్ట్ కానంది.

ఏదైనా సమస్య ఉంటే తన భర్తకు మాత్రమే సమాధానం చెబుతానని వెల్లడించింది. వేరే వాళ్లకు చెప్పాల్సిన పని లేదంది. మొత్తానికి ఈ ముదురు హీరోయిన్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. పైగా ఆమె టీవీ షోలలో కూడా బిజీగా ఉంది. ఇక తన భర్తకు ప్రతిదీ చెబుతా అని ప్రియమణి అనగానే నెటిజన్లు ఆమెకు బోల్డ్ గా మెసేజ్ లు పెడుతున్నారు.

Also Read: మా నాన్నే నాకు అడ్రస్ లేకుండా చేస్తా అన్నాడు – వనిత విజయ్ కుమార్
గతంలో మీరు బికినీ వేసిన సంగతి కూడా మీ భర్తకు చెబుతారా ? అని ఒకరు, మీరు మీ భర్తకు గౌరవం ఇస్తారా ? అని మరొకరు.. మీరు ఇప్పటికీ హీరోయిన్ గా చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మీలో ఇంకా మ్యాటర్ ఉంది’ అని ఇంకొకరు మెసేజ్ లు చేస్తున్నారు. ఇక మరో తుంటరి నెటిజన్ అయితే.. ప్రియమణి గురించి చాలా లోతుగానే మాట్లాడాడు.
‘ప్రియమణి డస్కీ బ్యూటీ అయినా.. ఆమె గ్లామర్ కి భారీ అభిమానులు ఉన్నారు అని, ఆమె ఒపుకోవాలే గానీ, ఆమె కోసం సినిమాలు క్యూ కడతాయని.. కానీ పెళ్లి అయింది కాబట్టి.. ప్రియమణి బోల్డ్ పాత్రలు చెయ్యడం లేదు అని, కానీ ఎప్పటికైనా ప్రియమణి మళ్ళీ బికినీ వేస్తే చూడాలని ఉందని కామెంట్ పెట్టాడు.
Also Read: కరోనా కరుణిస్తే.. మే 20న వస్తాం !
[…] Also Read: ప్రియమణి మళ్ళీ బికినీ వేస్తే చూడాలని… […]
[…] Also Read: ప్రియమణి మళ్ళీ బికినీ వేస్తే చూడాలని… […]