CM Jagan: కేంద్రంపై జ‌గ‌న్ వైఖ‌రి మార్చుకోవాల్సిందే.. ఆ విష‌యాల‌పై ప్ర‌శ్నించ‌కుంటే క‌ష్ట‌మే..!

CM Jagan: కేంద్రం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెడుతుందంటేనే దేశ ప్ర‌జ‌ల్లో ఎన్నో అంచ‌నాలు నెల‌కొనేవి. ఏ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో అని ప్ర‌జ‌ల‌తో పాటు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కూడా ఎదురు చూసేవి. వేటి ధ‌ర‌లు పెరుగుతాయో, ఏ శ్లాబులు త‌గ్గుతాయో అని ఆశ్చ‌ర్యం ఉండేది. ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే ప్ర‌తిసారి ఎదురు చూడ‌టం నిరాశ ప‌డ‌టం కామ‌న్ అయిపోతోంది. ఈ సారి కూడా తీవ్ర అన్యాయ‌మే జ‌రిగింద‌ని చెప్పొచ్చు. ఏపీ విభ‌జ‌న త‌ర్వాత తీవ్రమైన […]

Written By: Mallesh, Updated On : February 2, 2022 5:59 pm
Follow us on

CM Jagan: కేంద్రం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెడుతుందంటేనే దేశ ప్ర‌జ‌ల్లో ఎన్నో అంచ‌నాలు నెల‌కొనేవి. ఏ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో అని ప్ర‌జ‌ల‌తో పాటు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కూడా ఎదురు చూసేవి. వేటి ధ‌ర‌లు పెరుగుతాయో, ఏ శ్లాబులు త‌గ్గుతాయో అని ఆశ్చ‌ర్యం ఉండేది. ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే ప్ర‌తిసారి ఎదురు చూడ‌టం నిరాశ ప‌డ‌టం కామ‌న్ అయిపోతోంది. ఈ సారి కూడా తీవ్ర అన్యాయ‌మే జ‌రిగింద‌ని చెప్పొచ్చు.

CM Jagan

ఏపీ విభ‌జ‌న త‌ర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇక ఏపీకి నిధులు ఇవ్వాల్సిందిగా గ‌తంలో మోడిని క‌లిసి మ‌రీ జ‌గ‌న్ విన‌తి ప‌త్రం ఇచ్చారు. ఇక వైసీపీ ఎంపీలు కూడా ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ అయి ఇదే విష‌యాల‌పై విన్న‌వించారు. కానీ కేంద్రం మాత్రం వారి విన్న‌పాల‌ను ఏ కోశాన లెక్క చేయ‌లేద‌ని బ‌డ్జెట్ తేల్చేసింది. ప్రత్యేక హోదా నుంచి మొద‌లు పెడితే పోలవరం, రైల్వే ప్రాజెక్టుల లాంటి వాటికి నిధులు రాలేదు.

Also Read: Jagan-Chandrababu: జ‌గ‌న్ ఫార్ములాను వాడేస్తున్న చంద్ర‌బాబు.. ఏపీ సీఎం ఇర‌కాటంలో ప‌డుతారా..?

దీంతో వెంట‌నే రంగంలోకి దిగిపోయిన చంద్ర‌బాబు కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. బ‌డ్జెట్ లో తీవ్ర అన్యాయం చేశారంటూ మండిప‌డ్డారు. అయితే జ‌గ‌న్ మాత్రం ఈ విష‌యంపై నేరుగా స్పందించ‌ట్లేదు. కేవలం ఆర్థిక మంత్రి రాజెంద్రనాథ్‌ రెడ్డి మాత్రమే విమ‌ర్శ‌లు చేశారు. ఇటు కేసీఆర్ మాత్రం స్వ‌యంగా రంగంలోకి దిగి కేంద్రాన్ని నిల‌దీస్తున్నారు.

కానీ వైసీపీకి అత్య‌ధికంగా 28 మంది ఎంపీలు ఉన్నాకూడా కేంద్రాన్ని గ‌ట్టిగా నిల‌దీయ‌లేని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో ప్ర‌తిప‌క్షాలు దీన్ని అస్త్రంగా మార్చుకుంటున్నాయి. కాబ‌ట్టి ఇప్ప‌టికైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేంద్రాన్ని గ‌ట్టిగా నిల‌దీస్తే త‌ప్ప లాభం ఉండ‌ద‌ని అంటున్నారు. ఎందుకంటే గ‌తంలో చంద్ర‌బాబు ఇలాగే సైలెంట్ గాఉంటే.. ఇదే జ‌గ‌న్ విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టి జ‌నాల్లో ఆద‌ర‌ణ ద‌క్కించుకున్నారు. కాబ‌ట్టి ఇప్పుడు అదే ఫార్ములాను వాడుతున్న చంద్ర‌బాబుకు అవ‌కాశం ఇవ్వ‌కుండా జ‌గ‌న్ రంగంలోకి దిగాల‌ని నిపుణులు అంటున్నారు. లేక‌పోతే అంతిమంగా వైసీపీకే న‌ష్టం అని చెబుతున్నారు.

Also Read: Big Shock To Jagan Govt: ఏపీకి రాజ‌ధాని అదే అంట‌.. జ‌గ‌న్ కు షాక్ ఇచ్చిన కేంద్రం..!

Tags