https://oktelugu.com/

Vijay Devarakonda Liger Movie: ‘విజయ్ దేవరకొండ’తో సోషల్ మీడియా బ్యూటీ రొమాన్స్

Vijay Devarakonda Liger Movie: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘లైగర్’ సినిమాలో యుంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. పూరి జగన్నాథ్ డైరెక్ష‌న్‌లో వస్తున్న ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే చిత్రయూనిట్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఆమె ఒప్పుకుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఓవర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 22, 2022 / 08:52 AM IST
    Follow us on

    Vijay Devarakonda Liger Movie: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘లైగర్’ సినిమాలో యుంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. పూరి జగన్నాథ్ డైరెక్ష‌న్‌లో వస్తున్న ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే చిత్రయూనిట్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది.

    priyavarrier-vijaydeverakonda

    అయితే అందుకు ఆమె ఒప్పుకుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సాధించిన ప్రియా ప్రకాష్ వారియర్. నిజంగానే మరి లైగర్ లో స్పెషల్ సాంగ్ లో నటించిందా ? లేదా ? అనేది చూడాలి. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. పూరి ప్రస్తుతం చేస్తున్న సీక్వెన్స్ లో.. విజయ్ దేవరకొండను పక్కా బాక్సర్ గా భారీ బిల్డప్ తో చూపించబోతున్నాడట.

    Also Read:  పూనమ్‌ బూతు పై బూతుల హీరోయిన్ ఘాటు ప్రశంసలు !

    పైగా ఈ ఫైట్ సినిమా కథనే మలుపు తిప్పుతుందని.. కీలకమైన ఎమోషనల్ సన్నివేశం కూడా ఈ ఫైట్ సీక్వెన్స్ లోనే ఉండబోతుందని తెలుస్తోంది. అందుకే దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారట. కాగా వచ్చే నెలలో ఫస్ట్ వీక్ లోపు ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయనున్నారు. నిజానికి ఎప్పుడో ఈ సినిమా పూర్తి కావాల్సి ఉంది.

    Vijay Devarakonda

    అయితే, ఈ సినిమా షూటింగ్ గత రెండేళ్లుగా కరోనా కారణంగా పోస్ట్ ఫోన్ అవుతూనే ఉంది. అన్నట్టు విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. పైగా ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కష్టపడి సిక్స్ ప్యాక్ కూడా చేస్తున్నాడు. మరి ఆ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి.

    పూరి అయితే, ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ప్రేక్షకులు కూడా ఆ స్థాయి అంచనాలు పెట్టుకుంటే సినిమాకి కలెక్షన్స్ వస్తాయి.

    Also Read:ఓటీటీ రివ్యూ : జల్సా – అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం

    Recommended Video:

    Tags