https://oktelugu.com/

హీరోల చుట్టూ తిరుగుతోన్న యంగ్ బ్యూటీ !

యంగ్ మలయాళ బ్యూటీ ‘ప్రియా ప్రకాష్ వారియర్’కి అంతా అయిపోయాక తత్త్వం బోధపడినట్లు ఉంది. మీరు ఇచ్చినంతే పుచ్చుకుంటా.. ముందు మీ సినిమాలో నాకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వండి అంటూ అందర్నీ అడుగుతుందట. ప్రస్తుతం హైదరాబాద్ లోనే మకాం పెట్టి మరి కొన్ని ప్రొడక్షన్ హౌస్ లను టార్గెట్ చేసుకుని అవకాశాలను అడుగుతుందట. ఎందుకంటే అమ్మడు ఇప్పుడు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీనే నమ్ముకుంది. ఇప్పటికే, కొన్ని ఆఫర్లను అందుకున్న ప్రియా.. స్టార్ డమ్ రావాలంటే స్టార్ […]

Written By:
  • admin
  • , Updated On : December 16, 2020 / 03:43 PM IST
    Follow us on


    యంగ్ మలయాళ బ్యూటీ ‘ప్రియా ప్రకాష్ వారియర్’కి అంతా అయిపోయాక తత్త్వం బోధపడినట్లు ఉంది. మీరు ఇచ్చినంతే పుచ్చుకుంటా.. ముందు మీ సినిమాలో నాకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వండి అంటూ అందర్నీ అడుగుతుందట. ప్రస్తుతం హైదరాబాద్ లోనే మకాం పెట్టి మరి కొన్ని ప్రొడక్షన్ హౌస్ లను టార్గెట్ చేసుకుని అవకాశాలను అడుగుతుందట. ఎందుకంటే అమ్మడు ఇప్పుడు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీనే నమ్ముకుంది. ఇప్పటికే, కొన్ని ఆఫర్లను అందుకున్న ప్రియా.. స్టార్ డమ్ రావాలంటే స్టార్ హీరోల సినిమాల్లోనే నటించాలని… అందుకే నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలతో రెగ్యులర్ గా టచ్ లోకి వెళ్తుందట.

    Also Read: వెంకీ, వరుణ్, తమన్నాల రెమ్యూరేషన్లు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    కాగా ఈ క్రమంలోనే హీరో శర్వానంద్ కొత్త చిత్రంలో ప్రియా సెకెండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అలాగే మారుతి – నాని చేయబోతున్న సినిమాలో కూడా ప్రియాకి సెకెండ్ లీడ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగశౌర్య హీరోగా రాబోయే ఓ చిత్రంలో ఈ భామను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా షూట్ లో కూడా పాల్గొంది. ఏది ఏమైనా నాలుగైదు సినిమాల్లో తన నటనతో గాని ప్రియా మెప్పించగలిగితే మాత్రం అవకాశాలు ప్రియా దగ్గరకు వెతుక్కుంటూ వస్తాయి. కాకపోతే ఈ యంగ్ బ్యూటీకి ఎక్కువుగా సెకెండ్ హీరోయిన్ గానే అవకాశాలు వస్తున్నాయి కాబట్టి.. భవిష్యత్తులో అలాంటి పాత్రలకే పరిమితం అయ్యే ప్రమాదం కూడా ఉంది.

    Also Read: ఫెయిల్యూర్ డైరెక్టర్ కు మెగాస్టార్ అభినందనలు !

    మరి ప్రియా తన కెరీర్ ను ఎలా మల్చుకుంటుందో చూడాలి. ఏదో సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ తో పాటు స్టార్ డమ్ వచ్చేశాయి ఈ బ్యూటీకి. ఆ స్టార్ డమ్ ను మెయింటైన్ చేయడంలో ఇప్పటికే ప్రియా విఫలం అయింది. మొదట్లో బాగానే ఆఫర్లు వచ్చినా.. అమ్ముడికి ఆశ ఎక్కువై భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడంతో వచ్చిన ఆఫర్లు కాస్త దూరమైపోయాయి. ఇప్పుడు అవకాశాలు లేక అందర్నీ అడుగుతూ ముందుకు పోతుంది. దక్షిణాదిన ఇతర భాషల్లో కూడా ఒకటి రెండు సినిమాలు చేసి మంచి ఫేమ్ తెచ్చుకుంటే.. మళ్ళీ డిమాండ్ వస్తోందని ప్రియా ఆలోచన. మరి చూద్దాం ప్రియా ఎంతవరకు నెట్టుకొస్తోందో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్