https://oktelugu.com/

రెండో పెళ్ళికి సిద్దమైన రాఘవేంద్రరావు కోడలు !

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కోడలు కనికా థిల్లాన్ రెండో పెళ్ళికి సిద్ధమయ్యారు. ముంబైలో సోమవారం ఆమె నిశ్చితార్థం జరిగింది. బంధువుల మధ్య నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది. 2014లో బాలీవుడ్ రచయిత కనికా థిల్లాన్ ని ప్రకాష్ కోవెలమూడి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళైన తరువాత కొన్నాళ్లు కలిసున్న ఈ జంట ఆ తరువాత విడిపోయారు. చాలా కాలం విడివిడిగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకున్నట్లు వార్తలు రావడం జరిగింది. అయితే 2017లోనే కనికా, ప్రకాష్ […]

Written By:
  • admin
  • , Updated On : December 16, 2020 / 03:56 PM IST
    Follow us on


    ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కోడలు కనికా థిల్లాన్ రెండో పెళ్ళికి సిద్ధమయ్యారు. ముంబైలో సోమవారం ఆమె నిశ్చితార్థం జరిగింది. బంధువుల మధ్య నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది. 2014లో బాలీవుడ్ రచయిత కనికా థిల్లాన్ ని ప్రకాష్ కోవెలమూడి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళైన తరువాత కొన్నాళ్లు కలిసున్న ఈ జంట ఆ తరువాత విడిపోయారు. చాలా కాలం విడివిడిగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకున్నట్లు వార్తలు రావడం జరిగింది. అయితే 2017లోనే కనికా, ప్రకాష్ విడిపోయారు. విడిపోయినట్లుగా ఎక్కడా కూడా వీరు బయటపెట్టలేదు.

    Also Read: హీరోల చుట్టూ తిరుగుతోన్న యంగ్ బ్యూటీ !

    కాగా సోమవారం ప్రముఖ నిర్మాత మరియు రచయిత హిమాన్షు శర్మతో కనికా నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని కనికా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. హిమాన్షు శర్మతో జరిగిన నిశ్చితార్థ వేడుకకు సంబందించిన ఫోటోలు కనికా థిల్లాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇక అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైజ్ జీరో చిత్రానికి కనికా, ప్రకాష్ కలిసి పనిచేశారు. ఆ సినిమా ఘోర పరాజయం పాలైంది.

    Also Read: రొమాన్స్ చేసేటప్పుడు రోజా అన్నయ్య అనేదట !

    సైజ్ జీరో చిత్రానికి కథను కనికా అందించగా, దర్శకుడిగా ప్రకాష్ పనిచేశారు. ఆ సినిమా తరువాతే వీరి మధ్య విబేధాలు తలెత్తాయని సమాచారం. ఇక మధ్య ప్రకాష్ హీరోయిన్ అనుష్కను వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్