Bigg Boss 9 Telugu Priya: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అగ్నిపరీక్ష షో ద్వారా సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో ఒకరు ప్రియా శెట్టి(Priya Shetty). అగ్నిపరీక్ష షో సమయం లో ఈమెకు మంచి క్రేజ్ ఉండేది. చూసేందుకు అమ్మాయి ఎంతో అందంగా, క్యూట్ గా ఉంది, చాలా చక్కగా కూడా మాట్లాడుతుంది, ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని అభిమానులు చాలా బలంగా కోరుకున్నారు. కోరుకున్న విధంగానే ఈమె హౌస్ లోపలకు అడుగుపెట్టింది. హౌస్ లోకి వచ్చిన రోజు నుండి నేటి వరకు కాస్త బలుపు యాటిట్యూడ్ తో కొన్ని మాటలు మాట్లాడి బోలెడంత నెగిటివిటీ ని మూటగట్టుకుంది. అందరితో చాలా బాగా మాట్లాడుతుంది, టాస్కులు కూడా బాగానే ఆడుతుంది కానీ, మాట్లాడే విధానం లోనే తేడా జరుగుతుంది. అందుకే సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈమె ఎలిమినేట్ అవ్వాలని చాలా బలంగా కోరుకుంటున్నారు.
ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఆమె ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ లో అందరికంటే తక్కువ ఈమెకే ఉన్నట్టు తెలుస్తుంది. ఇదంతా రీసెంట్ గానే ఈమె తల్లిదండ్రులు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె తండ్రి మాట్లాడుతూ ‘బిగ్ బాస్ షో కి వెళ్తానని మా అమ్మాయి చెప్తే మేము వద్దు అన్నాము. అగ్ని పరీక్ష షో కి వెళ్తున్నప్పుడు కూడా వద్దు అనే చెప్పాము. కానీ నేను బిగ్ బాస్ లోకి వెళ్లి గట్టిగా పోటీని ఇస్తానని చెప్పి వచ్చింది. అగ్నిపరీక్ష షోలో మా అమ్మాయిని ఆడియన్స్ ఓట్లు వేసి హౌస్ లోకి అడుగుపెట్టేలా చేశారు. ఇప్పుడు అదే ఆడియన్స్ ఆమెని ట్రోల్ చేయడం చూసేందుకు చాలా బాధగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇంకా మాట్లాడుతూ ‘మా అమ్మాయికి నటించడం రాదు. చాలా ముక్కు సూటి మనిషి, తన మనసుకి ఏది అనిపిస్తే అదే మాట్లాడుతుంది. కానీ ఆమె బేస్ వాయిస్ కారణంగా గట్టిగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. దానికి ఎవరేమి చేయగలరు, అది దేవుడి ఇచ్చింది. దానిని పట్టుకొని ఆమెని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. అగ్నిపరీక్ష షోలో ఇదే గొంతు బాగుంది క్యూట్ అంటూ ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు అదే గొంతు ని వెక్కిరిస్తున్నారు. ఈ బిగ్ బాస్ షో కారణంగా మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఆగిపోవడం లాంటివి జరగవు. మా అమ్మాయి మనసుకి దగ్గరైనా వాడినే వెతికి పెళ్లి చేస్తాము’ అంటూ చెప్పుకొచ్చారు. వీళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.